వాగునీరు.. సముద్రంపాలు | - | Sakshi
Sakshi News home page

వాగునీరు.. సముద్రంపాలు

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 28 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2026
చూద్దాం రారండి!

సాక్షి, మహబూబాబాద్‌/ నర్సింహులపేట/మరిపెడ/డోర్నకల్‌/చిన్నగూడూరు : వాగుల్లో నీటి నిల్వకోసం చెక్‌ డ్యామ్‌లు నిర్మించారు. దీంతో నీటి నిల్వతో భూగర్భ జలాలు పెరిగి కరువు వచ్చినా.. నీటి ఎద్దడి ఏర్పడేది కాదు. కానీ, రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయిన చెక్‌డ్యామ్‌లు, కరకట్టలకు నేటికీ మరమ్మతులు చేపట్టలేదు. కొన్నిచోట్ల నాసికరంగా మరమ్మతులు చేపట్టడంతో మళ్లీ తెగిపోయాయి. దీంతో ఒడిసి పట్టాల్సిన నీరు సముద్రం పాలవుతోంది. కరువు కాలంలో కళ్లముందే నీరు సముద్రం పాలు కావడంతో రైతులు చలించిపోతున్నారు. కట్టలు కడితే పంటలు పండేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నర్సింహులపేటలో..

నర్సింహులపేట మండలంలోని కొమ్ములవంచ, జయపురం, కౌసల్యదేవిపల్లి, రామన్నగూడెం, ముంగిమడుగు గ్రామాల మీదుగా ఆకేరు వాగు ప్రవహిస్తోంది. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో వాగుపై కొమ్ములవంచలో ఆనకట్టను నిర్మించారు. తర్వాత జయపురం, ముంగిమడుగు గ్రామాల సమీపంలో రెండు ఆనకట్టలు నిర్మించారు. అయితే రెండు సంవత్సరాల క్రితం కొమ్ముల వంచ ఆనకట్ట షెట్టర్లు లీకేజీ అయ్యాయి. దీంతో నీరు నిల్వ ఉండకుండా కిందికి పోతున్నాయి. అదే విధంగా భారీ వర్షాలకు జయపురం, ముంగిమడుగు చెక్‌డ్యామ్‌లోని పక్కన ఉన్న కట్ట కొట్టుకుపోయింది. రూ. 4లక్షల మేరకు నిధులతో మరమ్మతు చేసినా.. నాసిరకంగా ఉండడంతో మళ్లీ కొట్టుకుపోయింది. చెక్‌డ్యామ్‌ల్లో నీరు నిల్వ ఉంటే 2వేల ఎకరాలకు పైగా భూములు సాగయ్యేవని రైతులు చెబుతున్నారు.

మరిపెడలో..

మరిపెడ మండలంలోని తానంచెర్ల రెవెన్యూ పరిధిలోని అజ్మీరాతండా గ్రామపంచాయతీ ఆనకట్టతండా శివారులో పాలేరు వాగుపై ఆటకట్ట నిర్మించారు. మూడేళ్ల క్రితం వరద ధాటికి ఆనకట్ట ధ్వంసమైంది. రెండుచోట్ల గండిపడి నీరు వృథాగా కిందికి పోతుంది. ఈ ఆనకట్ట మహబూబాబాద్‌–సూర్యపేట జిల్లాల సరిహద్దులో నిర్మించి ఉంది. యానకట్ట నిండా నీళ్లు ఉంటే సుమారు 400మంది రైతులు వ్యవసాయం చేస్తారు.

మారిన

మేడారం..

వాగులపై తెగిన కట్టల మరమ్మతులో అధికారుల తాత్సారం

కరువు కాలంలో నిల్వ లేకుండా

దిగువకు వరద ప్రవాహం

గండి పూడిస్తే నీరు నిల్వ ఉండేది.. భూగర్భ జలాలు పెరిగేవని రైతుల

ఆవేదన

డోర్నకల్‌లో..

డోర్నకల్‌ పట్టణ సమీపంలోని మున్నేరు వాగు ఆనకట్టకు సంబంధించి చాప్లాతండా వైపు సపోర్టు గోడ రెండున్నర ఏళ్ల క్రితం వరదలకు కొట్టుకుపోయింది. వాగు పొంగితే ఆనకట్టకు గండ్లు పడకుండా ఉండేందుకు చాపలతండా వైపు సపోర్టు గోడ నిర్మించారు. అయితే రెండున్నర ఏళ్ల క్రితం భారీ వరద రావడంతో సపోర్టు గోడ వరదకు కొట్టుకుపోయింది. కాగా, ఇరిగేషన్‌ అధికారులు నేటికీ మరమ్మతులు చేపట్టలేదు. అధికారులు వెంటనే స్పందించి ఆనకట్ట సపోర్టు గోడ పునరుద్ధరించాలని రైతులతో పాటు ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.

చిన్నగూడూరులో..

చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామ శివారులో 1964లో ఆనకట్ట నిర్మించారు. ఆకేరు నదిపై నిర్మించిన ఈ ఆనకట్ట ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 ఎకరాలకు సాగునీరు అందుతోంది. రెండేళ్ల క్రితం వచ్చిన భారీ వరదలతో ఉగ్గంపల్లి ఆనకట్ట కుడివైపు ఆనకట్ట, రెయిలింగ్‌ తెగిపోయింది. అయితే ఇప్పటి వరకు మరమ్మతు చేయించలేదు. దీంతో ఆనకట్టలో నిల్వ ఉండాల్సిన నీరు వృథాగా కిందికి వెళ్తోంది. దీంతో ఈ ప్రాంతం నుంచి నిండుగా ఆకేరు ప్రవహించినా.. నీరు లేక పంటలు పండడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement