అక్షరాస్యతతో సాధికారత.. విద్యతో అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

అక్షరాస్యతతో సాధికారత.. విద్యతో అభివృద్ధి

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

● ఇన్‌చార్జ్‌ డీఈఓ మందుల శ్రీరాములు

మహబూబాబాద్‌ రూరల్‌ : ప్రతి ఒక్కరూ అక్షరాస్యులుగా మారే లక్ష్యంతో అక్షరాస్యతతో సాధికారత.. విద్యతో అభివృద్ధి స్ఫూర్తితో ఉల్లాస్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇన్‌చార్జ్‌ డీఈఓ మందుల శ్రీరాములు పిలుపునిచ్చారు. మహబూబాబాద్‌ మండలంలోని మాధవాపురం గ్రామంలో ఉల్లాస్‌, నవభారత్‌ సాక్షరత కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న అమ్మకు అక్షరమాల పరీక్ష కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణ తీరును, అభ్యాసకులకు కల్పించిన సౌకర్యాలను, పరీక్షకు హాజరైన అభ్యాసకుల వివరాలను పరిశీలించారు. పరీక్షలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో, నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. ఉల్లాస్‌ కార్యక్రమం ద్వారా అక్షరాస్యతను పొందుతున్న అభ్యాసకులు చదవడం, రాయడం, ప్రాథమిక సంఖ్యా పరిజ్ఞానంలో సాధించిన ప్రగతిని అంచనా వేయ డం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, పెద్దలు విద్యను కొనసాగించడం ద్వారా తమ కుటుంబాలతో పాటు సమాజ అభివృద్ధికి దోహదపడతారని పేర్కొన్నారు. ఉల్లాస్‌ అసిస్టెంట్‌ కోఆర్డినేటర్‌ బి.శేషుకుమార్‌. ఐకేపీ ఏపీఎం శంకర్‌ సీసీ సుమలత, సంబంధిత వీఓఏలు కామాక్షి, శైలజ, కల్పన, సుమతి, సాక్షరత కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement