కొమ్ములవంచ ఆనకట్ట గేట్ల లీకేజీతో చుక్కనీరు ఆగడం లేదు. వానతో వచ్చిన నీరు లీకేజీతో వృథాగా వెళ్తోంది. మూడు సంవత్సరాలుగా ఎవరు పట్టించుకోవడం లేదు. వర్షంతో ఆనకట్టకు వచ్చిన నీరు వృథాగా పోతుండడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదు. వెంటనే మరమ్మతులు చేపట్టాలి..
–డొనికెన సోమన్న, కొమ్ములవంచ
నీరు వృథాగా వెళ్తోంది..
ముంగిమడుగు శివారులో ఆకేరు వాగుపై నిర్మించిన చెక్ డ్యామ్ తెగిపోయి మూడేళ్లు కావొస్తున్నా.. నేటికీ మరమ్మతులు చేయకపోవడంతో నీరు వృథాగా పోతోంది. భారీ వర్షంతో వాగు ఉధృతంగా ప్రవహించి చెక్‌డ్యామ్ తెగిపోవడంతో చుక్కనీరు నిలవడం లేదు. చెక్‌డ్యామ్ మరమ్మతులు చేపట్టి నీటినిల్వ చేస్తే రైతులకు సాగునీరు అందుతుంది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
–భూక్య చందూలాల్ నాయక్, పకీరతండా
నాసిరకం పనులతో మళ్లీ తెగింది..
జయపురం చెక్‌డ్యామ్ తెగడంతో మళ్లీ నీరు వృథాగా పోతోంది. రెండేళ్ల క్రితం చెక్‌డ్యామ్ తెగడంతో ఈ మధ్యకాలంలో సుమారు.5 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షంతో ఆకేరువాగు ఉధృతంగా ప్రవహించడంతో చెక్ డ్యామ్ మళ్లీ తెగడంతో నీరు వృథాగా పోతోంది. అధికారులు నాణ్యతగా పనులు చేపట్టి రైతుల ఇబ్బందులు తీర్చాలి.
–మందుల యాకూబ్, జయపురం


