మహబూబాబాద్: ఎల్‌నినో ప్రభావంపై అధికారులు ప్రజలకు వివరించాలని, నీటి వినియోగంపై అవగాహన కల్పించాలని ప్రభుత్వవిప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఎల్‌నినో, వీబీజీ రాంజీ పథకంపై పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లకు శనివారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాంచంద్రునాయక్ మాట్లాడుతూ.. నీటిని జాగ్రత్తగా వినియోగించుకో వాలన్నారు. వీబీజీ రాంజీ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ స్నేహశబరీష్ మాట్లాడుతూ జిల్లాలోని గంగారం, కొత్తగూడ మండలాల్లో భూగర్జజలాలు అడుగంటి పోయాయన్నారు. అందుకు అనుగుణంగా అధికారులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలన్నారు. ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ పురుషోత్తం, డీపీఓ రేవంత్ పాల్గొన్నారు.
బ్యాంక్‌లకు నేడు వర్కింగ్ డే
మహబూబాబాద్: బ్యాంక్ సిబ్బందికి వారానికి ఐదు రోజుల పనిదినాలు కల్పించాలని ప్రధా న డిమాండ్‌తో అన్ని బ్యాంక్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. సమ్మెలో భాగంగా ఈనెల 28, 29, 30 మూడు రోజులపాటు బ్యాంక్‌లు బంద్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నేడు (ఆదివారం) పని దినంగా ప్రకటించింది.
మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తాం
కొత్తగూడ: మండలంలోని గుంజేడు గ్రామంలో బాలుడికి డెంగీ సోకిన విషయం తెలుసుకు ని డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్ శనివారం గ్రామంలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దోమల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు పాటించాలన్నారు. కోర్లిన్ చేయించాలని హెల్త్ అసిస్టెంట్లు శ్రావణ్, రా మును ఆదేశించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని డాక్టర్ వరుణ్‌తేజ్‌కు చెప్పారు.
వివరాలు సమర్పించండి
సాక్షి కథనానికి సీఎంఓ స్పందన
నెహ్రూసెంటర్: ‘పసిపిల్లలు పదిలమేనా’ శీర్షికన ‘సాక్షి దినపత్రిక’లో ఈ నెల 23వ తేదీన ప్రచురితమైన కథనానికి సీఎం కార్యాలయం స్పందించింది. దీనికి సంబంధించిన వివరాలు సమర్పించాలని కోరింది. దీంతో జిల్లా అధికారులు జీజీహెచ్ సూపరింటెండెంట్‌ను సంబంధిత వివరాలు సమర్పించాలని ఆదేశించారు. నిధుల కొరత, పరికరాల పనితీరు వంటి అంశాలను సమగ్రంగా అందజేయాలని కోరారు.
రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్‌గా వెంకట్‌రెడ్డి
మహబూబాబాద్: జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్‌గా మాధవపెద్ది వెంకట్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని లయన్స్ క్లబ్ భవనంలో రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికల ప్రక్రియ శనివారం నిర్వహించారు. వైస్ చైర్మన్‌గా డాక్టర్ బానోత్ నెహ్రూ రాథోడ్, ట్రైజరర్‌గా వెంకన్న, కమిటీ సభ్యులుగా రావుల రవిచందర్‌రెడ్డిని ఎన్నికయ్యారు. అదనపు కలెక్టర్.. నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. తన ఎన్నికకు సహకరించిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పర్కాల శ్రీనివాస్‌రెడ్డి, యాళ్ల మురళీధర్‌రెడ్డి, వడ్డెబోయిన శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యావ్యవస్థలో సీఆర్పీల పాత్ర కీలకం
మహబూబాబాద్ అర్బన్: విద్యావ్యవస్థలో ఎంఎస్ కోఆర్డినేటర్లు, సీఆర్పీల పాత్ర కీలకమని జిల్లా పరీక్షల విభాగ అధిపతి మందుల శ్రీరా ములు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన ఓరియంటేష న్ కార్యక్రమంలో శ్రీరాములు మాట్లాడారు. ఏక్ పేడ్ మాకే నామ్‌ను పూర్తి చేయాలని, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి ప్రభుత్వ బడుల్లో చేర్పించాలన్నారు. ఎన్రోల్‌మెంట్, అపార్, ఆధార్‌లను యూడైస్‌లో అప్‌లోడ్ చేయాలన్నా రు. అన్ని మండలాల్లో ఎంఎస్ కోఆర్డినేటర్లు, సీఆర్పీలు వారికి కేటాయించిన పాఠశాలలను సందర్శించి, ఉపాధ్యాయులతో సమస్యలను అడిగి తెలుసుకొని విద్యార్థులకు వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ అప్పారావు, సీఎంఓ వంగ సురేష్, ఏసీఎస్ సంతోష్‌కుమార్, ఏఎంఓ వెంకటేశ్వర్లు, సీఆర్పీలు, కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.


