మహబూబాబాద్ రూరల్ : చాకలి ఐలమ్మ పోరా టం స్ఫూర్తిదాయకమని ఎస్పీ శబరీష్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ వీరవనిత, రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళులర్పించి, మాట్లాడుతూ సామాజిక అన్యాయాన్ని, పెత్తందారీ దోపిడీని ఎదిరిస్తూ ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యం, ఆత్మగౌరవ పోరాట పటిమ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఆమె త్యాగా న్ని, ధైర్యాన్ని స్మరించుకుంటూ ప్రజాసేవలో మరింత అంకితభావంతో పనిచేయడమే ఆమెకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
మాదకద్రవ్యాల నిర్మూలనపై దృష్టి
కేసముద్రం: మాదకద్రవ్యాల నిర్మూలనపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ శబరీష్ అన్నారు. శనివారం కేసముద్రం పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి, పరిసరాలు, సిబ్బంది విధుల నిర్వహణ, కేసుల దర్యాప్తు, ప్రజలకు అందుతున్న పోలీస్ సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయం, వినియోగంపై నిఘా పెంచాలన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రజలకు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కలిసే సమయాన్ని పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్సై క్రాంతికిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ శబరీష్
చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు


