పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రాధాన్యం

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

మహబూబాబాద్‌ రూరల్‌ : పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా కంబాలపల్లి పెద్ద చెరువు వద్ద శనివారం నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మొదటగా పురాతన రాజరాజేశ్వర స్వామివారి శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చెరువు ప్రాంగణంలో మొక్క నాటారు. జిల్లాలోని పర్యటక ప్రదేశాలపై పాఠశాల విద్యార్థులు వేసిన పెయింటింగ్‌, ఫొటో ఎగ్జిబిషన్‌ సందర్శించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ కురవి వీరభద్ర స్వామి, కందికొండ లక్ష్మీనరసింహస్వామి, నరసింహులపేట వెంకటేశ్వర స్వామి ఆలయం, బయ్యారం పెద్ద చెరువు, మత్తడి, అనంతరం, భీముని పాదం, గుంజేడు ముసలమ్మ తల్లి ఆలయం, పురాతనమైన ఆలయాలు ఏడు బావులు, కంబాలపల్లి పెద్ద చెరువు, గ్రీన్‌ హిల్స్‌ క్యాంపింగ్‌, పులిమడుగు క్యాంపింగ్‌, బయ్యారం జలపాతం, పర్యటక ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యచర్యలతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 49 శాతం అడవి ఉందని అందులో ఎంతో అద్భుతమైన టూరిజం స్పాట్స్‌ ఉన్నాయని తెలిపారు. సంస్కృతిపై క్లుప్తంగా పుస్తకం రాసిన రమేష్‌ను అభినందించారు. టూరిజం నోడల్‌ అధికారి శ్రీమన్నారాయణరెడ్డి, ఇన్‌చార్జ్‌ అదనపు కలెక్టర్‌ పురుషోత్తం, ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ చీరిక వసంతఉపేందర్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ కమటం యాకన్న, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గుగులోతు జ్యోతి, మున్సిపల్‌ కమిషనర్‌ వినోద్‌ కుమార్‌, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ నితీష్‌, టీఎస్‌ఎస్‌ సారధి కొలిశెట్టి సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి అభిలాష్‌ పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన అవసరం

కేసముద్రం: ప్రకృతి వ్యవసాయంపై ప్రతీ ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. మండలంలోని తాళ్లపూసపల్లిలో జైపాల్‌రెడ్డి అనే రైతు వ్యవసాయ క్షేత్రంలో జాతీయ మిషన్‌ నేచురల్‌ ఫామింగ్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని 17 క్లస్టర్‌లకుగాను 34 సీఆర్పీలకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ప్రతీ ఒక్కరు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపే విధంగా వ్యవసాయ ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు, సీఆర్పీలకు ప్రభుత్వాలు అందిస్తున్న కార్యక్రమాల ద్వారా సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహించి, సబ్సిడీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఏఓ విజయచంద్ర, ఉద్యానవన శాఖ అధికారి మరి యన్న, శాస్త్రవేత్త, శాస్త్రవేత్త, అధిపతి అడ్లూరి ప్రశాంత్‌కుమార్‌, వెంకట్‌రెడ్డి, రామారావు, నాగేశ్వర్‌రావు, తహసీల్దార్‌ వివేక్‌, ఏఓ వెంకన్న పాల్గొన్నారు.

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement