సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

తొర్రూరు రూరల్‌: సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటూ సైబర్‌ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని తొర్రూరు జూనియర్‌ సివిల్‌ కోర్టు జడ్జి దామెర ధీరజ్‌కుమార్‌ సూచించారు. శనివారం మండలంలోని వెలికట్ట జిల్లా పరిషత్‌ పాఠశాలలో మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతి థిగా పాల్గొన్న జడ్జి మాట్లాడుతూ విద్యార్థులు సెల్‌ఫోన్ల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలని, తెలియ ని వ్యక్తులు ఫోన్లు చేస్తే మాట్లాడొద్దని తెలిపారు. ఓటీపీలు ఇతరులకు చెప్పి మోసపోవద్దని సూచించారు. హెచ్‌ఎం శ్రీనుబాబు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

న్యాయ సేవలు అందేలా చూడాలి

మహబూబాబాద్‌ రూరల్‌ : సమాజంలోని మూగ, చెవిటి (బధిరులు) వారిని క్షేత్రస్థాయిలో గుర్తించాల్సిన కీలక బాధ్యత పారా లీగల్‌ వలంటీర్లపై ఉందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి స్వాతి మురారి అన్నారు. ప్రపంచ బధిరుల దినోత్సవం ఆదివారం జరుపుకోనున్న నేపథ్యంలో స్వాతి మురారి పారా లీగల్‌ వలంటీర్లతో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేవలం మూగ, చెవిటి వారిని గుర్తించడమే కాకుండా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా వారికి లభించే ఉచిత న్యాయ సేవలు, సలహాలు, చట్టపరమైన హక్కుల గురించి అవగాహన కల్పించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement