అభాగ్యులకు అండగా న్యాయ సేవాధికార సంస్థ | - | Sakshi
Sakshi News home page

అభాగ్యులకు అండగా న్యాయ సేవాధికార సంస్థ

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్‌

మహబూబాబాద్‌ రూరల్‌ : సమాజంలో బలహీనవర్గాలకు న్యాయ సేవాధికార సంస్థ అండగా నిలు స్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మురళీమోహన్‌ అన్నారు. మహబూబాబాద్‌ సబ్‌ జైలును శని వారం ఆయన సందర్శించి విచారణలో ఉన్న ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ని ఉటంకిస్తూ చట్టం నిర్దేశించిన విధానం ద్వారా తప్ప ఏ వ్యక్తి ప్రాణాన్ని లేదా వ్యక్తిగత స్వే చ్ఛను హరించే హక్కు ఎవరికీలేదని స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులతో అణచివేతకు గురికాకుండా స్వేచ్ఛగా జీవించడమే అసలైన జీవి తమని చెప్పారు. సమాజంలో అభాగ్యులకు సత్వర న్యాయాన్ని అందించేందుకే న్యాయ సేవాధికార సంస్థలు ఏర్పాటయ్యాయని వివరించారు. అనంతరం జైల్లోని అన్ని బ్యారకులు, వంట గది, సరుకుల నిల్వ గదిని పరిశీలించారు. ఆయన వెంట చీఫ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ దాసరి నాగేశ్వరరావు, అసిస్టెంట్‌ లీగల్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ రాజుకృష్ణ, జైలర్‌ మల్లెల శ్రీనివాసరావు, వలంటీర్‌ రాంప్రభు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement