ఆర్టీసీ ఎన్నికలకు గుర్తుల కేటాయింపు | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఎన్నికలకు గుర్తుల కేటాయింపు

Sep 27 2026 12:58 AM | Updated on Sep 27 2026 12:58 AM

● ఉధృతం కానున్న ప్రచారం

హన్మకొండ: టీజీఎస్‌ ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికలకు కార్మిక శాఖ శనివారం గుర్తులు కేటాయించింది. దీంతో ఎన్నికల నిర్వహణపై పూర్తి స్పష్టత వచ్చింది. ఇప్పటికే మొదలు పెట్టిన ప్రచారం గుర్తుల కేటాయింపుతో ఉధృతం కానుంది. గతంలో తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌కు కేటాయించిన విల్లు, బాణం గుర్తును తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌కు కేటాయించారు. ఆర్టీసీ సామాజిక తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌కు బతుకమ్మ, ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌కు నిచ్చెన, టీఎస్‌ ఆర్టీసీ బహుజన వర్కర్స్‌ యూనియన్‌కు కత్తెర, టీఎస్‌ ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ బస్‌, టీఎస్‌ ఆర్టీసీ కార్మిక పరిషత్‌కు బస్‌ టైర్‌, టీఎస్‌ ఆర్టీసీ కార్మిక సంఘ్‌కు టైగర్‌, టీఆర్టీసీ బహుజన కార్మిక యూనియన్‌కు ధర్మచక్ర, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌కు నక్షత్రం, నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌కు కాగడ, స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌కు తరాజు, తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌కు గధ గుర్తును కార్మిక శాఖ కేటాయించింది.

తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ సంబరాలు..

తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ (అశ్వత్థామ రెడ్డి వర్గం)కు విల్లు, బాణం గుర్తు కేటాయించడంతో ఆ యూ నియన్‌ సంబరాలు చేసుకుంది. గతంలో టీఎంయూగా కొనసాగిన అశ్వత్థామ రెడ్డి వర్గం గుర్తింపు ఎన్నికలో తెలంగాణ ఆ ర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌గా పోటీ చేస్తుంది. అయితే గతంలో టీఎంయూ గుర్తుగా కార్మికుల్లోకి విస్తృతంగా ప్రచారంలో ఉన్న విల్లు, బాణం గుర్తు తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌కు కేటాయించడంతో శనివారం రాత్రి హనుమకొండలోని వరంగల్‌–1, వరంగల్‌–2, హనుమకొండ డిపోల వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నాయకులు జితేందర్‌ రెడ్డి, ఎస్‌.కె.వై.పాషా, రాతిపల్లి సాంబయ్య, జి.సత్తయ్య, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఎస్‌జీఎఫ్‌ ఎంపికలు

వరంగల్‌ స్పోర్ట్స్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లా స్థాయి పాఠశాల క్రీ డల సమాఖ్య అండర్‌– 14, 17 బాలబాలికల ఎంపిక పోటీలు శనివారం ఉత్సాహంగా కొనసాగాయి. వరంగల్‌ జిల్లా ఎస్‌జీఎఫ్‌ ఆధ్వర్యంలో వరంగల్‌ కాశీబుగ్గలోని ఓసిటీ మైదానంలో ఉషు, టంగ్‌తా క్రీడల ఎంపికలు నిర్వహించా రు. అలాగే , హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో వెయిట్‌ లిఫ్టింగ్‌, లాన్‌టెన్నీస్‌ క్రీడాంశాల్లో ఎంపికలు నిర్వహించినట్లు ఎస్‌జీఎఫ్‌ వరంగల్‌ జిల్లా కార్యదర్శి పుల్ల అ నిల్‌ తెలిపారు. నాలుగు క్రీడాంశాల్లో జరిగిన ఈ పోటీలకు ఉ మ్మడి జిల్లా నుంచి 400 మంది క్రీడాకారులు ఎంపికై నట్లు చె ప్పారు. పీఈటీల సంఘం వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు ఎం. వెంకటేశ్వర్లు, కన్వీనర్లు పి. సుధాకర్‌, జె. సతీశ్‌, బి. రవీనా, సుజాత, జి. ధన్‌రాజ్‌, పీఈటీలు నాగరాజు, సతీశ్‌, పాషా, సమ్మయ్య, పెద్దిరాజ్‌, రఘువీర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement