అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయస్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం

Sep 27 2026 12:58 AM | Updated on Sep 27 2026 12:58 AM

వరంగల్‌ స్పోర్ట్స్‌: క్రీడలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించి, గ్రామస్థాయి నుంచే అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. వరంగల్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో రెండు రోజులపాటు నిర్వహించనున్న 12వ తెలంగాణ రాష్ట్ర అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హాజరై వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్‌ నాగరాజు, వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ శ్వేతతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్‌లో వరంగల్‌ను స్పోర్ట్స్‌ హబ్‌గా తీర్చిదిద్దేలా సమగ్ర రూపకల్పన చేస్తున్నామన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్‌ నాగరాజు మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ మైదానాల్లో పోటీ పడాలని సూచించారు. వరంగల్‌ సీపీ శ్వేత మాట్లాడుతూ జేఎన్‌ స్టేడియం క్రీడాకారులకు వరమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. క్రీడల్లో విజయం సాధించడం కంటే పాల్గొనడమే గొప్ప విజయమన్నారు. తెలంగాణ అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి కె. సారంగపాణి మాట్లాడుతూ అండర్‌– 14,16,18,20 బాలబాలికలు, మెన్‌ అండ్‌ ఉమెన్‌ విభాగాల్లో జరుగుతున్న పోటీలకు రాష్ట్రంలోని ఆయా జిల్లాల నుంచి 1,500 మంది క్రీడాకారులు పాల్గొనగా, 220 ఈవెంట్లు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి రోజు 120 ఈవెంట్లు జరిగినట్లు తెలిపారు. గ్రంథాలయ సంస్థ హనుమకొండ జిల్లా చైర్మన్‌ అజీజ్‌ఖాన్‌, డీవైఎస్‌ఓ ప్రశాంత్‌, వరంగల్‌ జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ గట్టు మహేశ్‌బాబు, అధ్యక్షుడు పుల్యాల కిషన్‌, కార్యదర్శి ఊర యుగెంధర్‌రెడ్డి, సంఘం రాష్ట్ర బాధ్యుడు వెంకటేశ్వర్‌రెడ్డి, కోచ్‌లు, టెక్నికల్‌ అఫీషియల్స్‌, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

అట్టహాసంగా రాష్ట్ర స్థాయి

అథ్లెటిక్స్‌ పోటీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement