పథకాల సమాచారం ప్రజలకు చేరవేయాలి | - | Sakshi
Sakshi News home page

పథకాల సమాచారం ప్రజలకు చేరవేయాలి

Sep 27 2026 12:58 AM | Updated on Sep 27 2026 12:58 AM

జనగామ: కాంగ్రెస్‌ పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు రూపొందించిన ‘సారథి యాప్‌’ను రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు యాప్‌ను విస్తృతంగా వినియోగించి ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని మంత్రి సూచించారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాగా, జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి శాశ్వత కార్యాలయం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని ధన్వంతి లక్ష్మీనారాయణ లకావత్‌.. మంత్రిని కోరారు. దీనిపై స్పందించిన పొంగులేటి.. తగిన స్థలాన్ని పరిశీలించి కేటాయించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌, వైటీడీఏ మెంబర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ నాయక్‌, తదితరులు పాల్గొ న్నారు.

రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

‘సారథి’ యాప్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement