విద్యార్థులను ఎలుకలు కొరికినా
పాలకుర్తి టౌన్: విద్యార్థులను ఎలుకలు కొరికినా ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి సోయి లేదని, రా ష్ట్రంలో అసలు విద్యాశాఖ ఉందా అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరు శ్రీనివాస్ ప్రశ్నించారు. శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘి క సంక్షేమ బాలికలను పరామర్శించేందుకు గురుకుల పాఠశాలకు బీజేపీ నాయకులు వెళ్లగా గేటు తాళం తీయలేదు. దీంతో గేటు వద్దే ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్.. మాజీ ఎమ్మెల్యే ధర్మారావుతో కలిసి మాట్లాడుతూ రాష్ట్రంలో కీసర, భద్రాద్రి కొత్తగూడెం, పాలకుర్తి గురుకుల పాఠశాలతోపాటు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్‌లో విద్యార్థులను ఎలుకలు కొరుకుతున్నా అధికారులకు పట్టింపు లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు లేగ రామోహ్మన్‌రెడ్డి మాట్లాడుతూ క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న గురుకుల పాఠశాలలో విద్యార్థినులను ఎలుకలు కొరికితే స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కనీసం పరామర్శించలేదని విమర్శించారు. కార్యక్రమంలో రంగు రాములు, దొంగరి మహేందర్, పల్లె కుమార్, మారం రవికుమార్, నిరంజన్‌రెడ్డి,లాకావత్ రవి, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్


