● రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి
కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కేసముద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా చేపడుతున్న సెంట్రల్ లైటింగ్ పనులను ఆయన పరిశీలించి, మాట్లాడారు. దసరా పండుగ లోపు రోడ్డు పనులు, సెంట్రల్ లైటింగ్ సిస్టం, సైడ్ డ్రెయినేజీ పనులు పూర్తయ్యేలా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవనం, అర్పనపల్లిలో బ్రిడ్జి పనులు, పాలిటెక్నిక్ కాలేజీ భవనం, డిగ్రీ కాలేజీ, ఉప్పరపల్లిలో సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. అంతకు ముందు వెంకటగిరి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ సర్పంచ్ మాదారపు సత్యనారాయణరావు, కేసముద్రంస్టేషన్‌లో గొట్టం దామోదర్ కుటుంబాలను ఆయన పరామర్శించారు. కార్యక్రమంలో కేసముద్రం మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బానోత్ సునీతవెంకన్న, వైస్ చైర్‌పర్సన్ అల్లం రమనాగేశ్వర్‌రావు, ధన్నసరి, కేసముద్రం పీఏసీఎస్‌ల వైస్ చైర్మన్‌లు అల్లం నాగేశ్వర్‌రావు, అంబటి మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిలువేరు సమ్మయ్యగౌడ్, ఆర్టీఏ మెంబర్ రావుల మురళి, బండారు వెంకన్న, బండారు దయాకర్, వేముల శ్రీనివాస్‌రెడ్డి, ఎండి.అయూబ్‌ఖాన్, కనుకుల రాంబాబు, వల్లందాసు రవికుమార్, శ్రీరాం కిరణ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.


