బాలల రక్షణలో చట్టాలు కీలకం | - | Sakshi
Sakshi News home page

బాలల రక్షణలో చట్టాలు కీలకం

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

గూడూరు: బాలల రక్షణలో ప్రభుత్వ చట్టాలు కీలకమని, బాలికా విద్య కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి స్వాతిమురారి అన్నారు. మండలంలోని బ్రాహ్మణపల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో శుక్రవారం సంస్థ ఆధ్వర్యంలో పోక్సో, బాల్య వివాహ నిషేధ చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. లింగ భేదాలకు తావులేకుండా 18సంవత్సరాల లోపు వయసున్న బాలబాలికలందరికీ ఈ చట్టాలు పూర్తిగా రక్షణ, చట్టద్ధమైన భద్రత కల్పిస్తాయని తెలిపారు. పోక్సో చట్టం బాలలపై లైంగిక దాడులను అరికట్టడంలో కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. బాలలపై ఎక్కడైనా లైంగిక దాడులు జరిగినట్లు తెలిస్తే పోలీసులకు, చైల్డ్‌లైన్‌ ఫిర్యాదు చేయాలని కోరారు. బాల్య వివాహాలను ప్రోత్సహించొద్దని, చట్టరీత్యా నేరమని అన్నారు. సలహాల కోసం టోల్‌ప్రీ నంబర్‌ 15100కు కాల్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రత్యేక అధికారి సునీత, అయోధ్యపురం పీహెచ్‌సీ వైద్యుడు పవన్‌కుమార్‌, ఉపాధ్యాయ బృందం, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి

స్వాతిమురారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement