మద్యం అమ్మితే పథకాలు కట్‌ | - | Sakshi
Sakshi News home page

మద్యం అమ్మితే పథకాలు కట్‌

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

● భాంజీపేటలో గ్రామపంచాయతీ తీర్మానం

రఘునాథపల్లి: గ్రామంలో విచ్చలవిడిగా కొనసాగుతున్న బెల్ట్‌షాపులను నివారించేందుకు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని భాంజీపేటలో గ్రామస్తులు ఏకమయ్యారు. శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌ గైని శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన జరిగిన గ్రామసభలో వార్డు సభ్యులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామాఖ్య సంఘాల మహిళలు, యువకులు పాల్గొని అక్టోబర్‌ 2 నుంచి గ్రామంలో మద్య నిషేదం అమలు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎవరైనా గ్రామంలో మద్యం విక్రయిస్తే పింఛన్‌, విద్యుత్‌, రేషన్‌ ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిపి వేయాలని గ్రామసభలో తీర్మానం చేశారు. అనంతరం సర్పంచ్‌.. గ్రామ పెద్దలతో కలిసి సీఐ, తహసీల్దార్‌, ఎస్సైలకు తీర్మాన పత్రాలు అందజేసి మద్య నిషేధానికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ చాట్ల శ్రీనివాస్‌, పంచాయతీ కార్యదర్శి కిరణ్‌కుమార్‌, మాజీ ఎంపీటీసీ పగిడిపల్లి కృష్ణ, మాజీ సర్పంచ్‌ గొరిగ ఇస్తారి, వార్డు సభ్యులు పగిడిపల్లి రాజు, కొనేటి శ్రీనివాస్‌, కొంతం మహేందర్‌, ఇందిర, చాట్ల మధు, రమ, వీఓ అధ్యక్షుడు కన్న రాజశ్రీ, కార్యదర్శి కాసర్ల రమ, వీఓఏ అలివేణి, నాయకులు కొమ్మగల్ల శ్రీనివాస్‌, చాట్ల మైసయ్య, రాగీరు కృష్ణ, చెరుకు భాస్కర్‌, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement