పెరుగుతున్న గోదావరి | - | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న గోదావరి

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

● సమ్మక్క సాగర్‌ బ్యారేజీ వద్ద ఉధృతంగా ప్రవాహం

కన్నాయిగూడెం: మండలంతోపాటు ఎగువన నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరి వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో తుపాకులగూడెంలోని సమ్మక్క సాగర్‌ బ్యారేజీ వద్ద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. బ్యారేజీలోకి 1,72,300 క్యూసెక్కుల నీరు చేరుతుండగా.. బ్యారేజీ గేట్లను ఎత్తి 1,57,400క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజీ వద్ద 77.2 మీటర్ల నీటి మట్టం కొనసాగుతుంది. కాగా గుట్టలగంగారం వద్ద ఉన్న దేవాదుల జే.చొక్కారావు ఎత్తిపోతల వద్ద ఉన్న పది మోటార్లలో ఏడు మోటార్లతో 1,837 క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ఎత్తిపోతల వద్ద ఫేజ్‌ వన్‌లో ఒకటి, ఫేజ్‌ టూలో రెండు, ఫేజ్‌ త్రీలో నాలుగు మోటార్లు మొత్తం ఏడు మోటార్లతో నీటిని భీంఘనపుర్‌ రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. ఎత్తిపోతల వద్ద 76 మీటర్ల నీటి మట్టం కొనసాగుతుంది.

మేడిగడ్డ బరాజ్‌కు స్వల్ప వరద

కాళేఽశ్వరం: తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా మేడిగడ్డ బరాజ్‌కు వరద తాకి డి స్వల్పంగా పెరుగుతోంది. శుక్రవారం గోదా వరి, ప్రాణహిత నదుల గుండా కాళేశ్వరం చేరుతోంది. అక్కడి నుంచి దిగువకు మేడిగడ్డ బరాజ్‌ వద్ద 52,250 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలిరాగా, మొత్తం 85గేట్లు ఎత్తి వచ్చిన వరదను మొత్తం అదేస్థాయిలో కిందకు వదులుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement