చారిత్రక, ప్రకృతి సంపదను సంరక్షిద్దాం | - | Sakshi
Sakshi News home page

చారిత్రక, ప్రకృతి సంపదను సంరక్షిద్దాం

Sep 26 2026 1:20 AM | Updated on Sep 26 2026 1:20 AM

● రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క

వెంకటాపురం(ఎం): కాకతీయుల కళా సంపదకు రామప్ప ఆలయం నిలువెత్తు నిదర్శనమని, ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప వంటి సంపదను పరిరక్షించి భావితరాలకు అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. వరల్డ్‌ టూరిజం డే–2026ను పురస్కరించుకొని శుక్రవారం రామప్ప దేవాలయం ఆవరణలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ బో ర్ఖడే హేమంత్‌ సహదేవరావు అధ్యక్షతన హెరిటేజ్‌ వాక్స్‌, తెలంగాణ దర్శిని, కాంపిటేషన్స్‌, కల్చరల్‌ కార్యక్రమాలను నిర్వహించగా మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గొల్లల గుడి నుంచి రామప్ప దేవాలయం వరకు నిర్వహించిన హెరిటేజ్‌ వాక్‌ను ఆమె ప్రారంభించారు. మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన ములుగు జిల్లాలో అందమైన చెట్లు, గుట్టలు, సెలయేళ్లు, వాగులు, వన్యప్రాణులతో అపారమైన ప్రకృతి సంపద ఉందన్నారు. పర్యాటక రంగంలో ములుగు జిల్లాకు పురస్కారం లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, కాంపిటేషన్స్‌లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదా నం చేశారు. చల్వాయి టీజీఎంఎస్‌కు చెందిన శ్రీజ బృందం ప్రథమ బహుమతి, దేవగిరిపట్నం తెలంగాణ మైనారిటీ బాలికల పాఠశాలకు చెందిన శ్రీవల్లి ద్వితీయ బహుమతి, గోవిందరావుపేట బాలికల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన ఎన్‌.మనస్విని, ఏ.శ్రుతి, ఎం.పావలి తృతీయ బహుమతి అందుకున్నారు. కార్యక్రమంలో ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌, అదనపు కలెక్టర్లు మహేందర్‌ జి, సంపత్‌ రావు, పంచాయతీరాజ్‌ శాఖ డైరెక్టర్‌ భగవాన్‌ రెడ్డి, టూరిజం నోడల్‌ అధికారి ధర్మ నాయక్‌, సర్పంచ్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement