సాక్షి, సిటీబ్యూరో: పుణేకు చెందిన కాస్మోస్ సహకార బ్యాంక్ తెలంగాణలో మరో రెండు శాఖలను ప్రారంభించింది. హనుమకొండ, వరంగల్‌లో ఏర్పాటైన బ్రాంచ్ బ్యాంక్‌కు 194వది కాగా, హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లో ప్రారంభమైంది 195వది. వరంగల్ బ్రాంచ్‌ను బ్యాంక్ డైరెక్టర్ అజిత్ గిజారే, ఎల్‌బీనగర్ బ్రాంచ్‌ను చైర్మన్ సచిన్ ఆప్టే ప్రారంభించారు. కార్యక్రమంలో లా అండ్ ఆర్డర్ డీజీపీ మహేశ్ భగవత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణలో బ్యాంక్‌కు ఏడు శాఖలు ఉన్నాయని సచిన్ తెలిపారు. దక్షిణ భారత్ విస్తరణలో భాగంగా కోయంబత్తూర్, విశాఖపట్నం, విజయవాడ, హుబ్లీ, చైన్నె, తిరుప్పూర్‌లో శాఖలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ నవంబర్ నాటికి దేశవ్యాప్తంగా 200 శాఖలకు చేరుకోవడమే లక్ష్యమన్నారు. కొంకణ్ ప్రాంతంలోనూ శాఖలను ప్రారంభించే ప్రణాళిక ఉందన్నారు. కార్యక్రమంలో బ్యాంక్ ఉపాధ్యక్షుడు డా.యశ్వంత్ కాసర్, ఇతర ఉన్నతాధికారులు, ఖాతాదారులు పాల్గొన్నారు.
దక్షిణ భారత్‌లో మరిన్ని శాఖలకు ప్రణాళిక


