నలుగురు దొంగల అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నలుగురు దొంగల అరెస్ట్‌

Sep 24 2026 2:00 AM | Updated on Sep 24 2026 2:00 AM

సిద్దిపేటరూరల్‌: ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న దొంగలను చిన్నకోడూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్‌ సీఐ కార్యాలయంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. నారాయణరావుపేట మండల పరిధి లోని జక్కాపూర్‌ గ్రామానికి చెందిన బుచ్చెల్లి అఖి ల ఇంటి తలుపులను పగులగొట్టి దుండగులు ఇంట్లో నుంచి బంగారం, వెండి ఆభరణాలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీ, పెట్రోల్‌బంక్‌, టో ల్‌ప్లాజా రికార్డులను పరిశీలించారు. ఎరుపు రంగు కారులో వచ్చిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా జక్కాపూర్‌లో చోరీతో పా టు ఇతర చోరీలకు పాల్పడినట్లు నేరం ఒప్పకున్నా రు. నిందితులు నలుగురు మహబూబాబాద్‌ జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన మాదగాని సురే శ్‌, దాసరి నాగయ్య, కుజా కల్యాన్‌, కట్ల మహేశ్‌, వ రంగల్‌ జిల్లాకు చెందిన ఉండాడి మహేశ్‌ ఉన్నారు. గతంలో వీరిపై కేసులున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి కారు, 4 మొబైల్‌ ఫోన్లు, 7 గ్రాముల బంగా రం, 33 తులాల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలి పారు. సీఐ విద్యాసాగర్‌, చిన్నకోడూరు,రాజ్‌గోపాల్‌పేట ఎస్సైలు చంద్రమోహన్‌, వివేక్‌, సిబ్బందిని సీపీ సాధన రష్మీ పెరుమాళ్‌ అభినందించారు.

బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఏసీపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement