కాలేజీకి వెళ్లమని తల్లిదండ్రులు మందలింపు.. | - | Sakshi
Sakshi News home page

కాలేజీకి వెళ్లమని తల్లిదండ్రులు మందలింపు..

Sep 24 2026 2:00 AM | Updated on Sep 24 2026 2:00 AM

నిషేధిత పురుగు మందు ఎవరు విక్రయించారు?

కురవి : కాలేజీకి వెళ్లమని తల్లిదండ్రులు మందలించడంతో ఓ విద్యార్థి గడ్డి మందుతాగాడు. అనంతరం ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది. ఈ విషయం ఆలస్యంగా బుధవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సదరు విద్యార్థి తల్లిదండ్రులు సోషల్‌ మీడియాలో వివరాలు వీడియో రూపంలో పోస్ట్‌ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్‌ జిల్లా సీరోలు మండలం రేకుల తండాకు చెందిన తేజావత్‌ కస్నానాయక్‌, కవిత దంపతుల కుమారుడు ప్రసాద్‌ ఇంటర్మీడియట్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. ఈనెల 18వ తేదీన ప్రసాద్‌ను కాలేజీకి వెళ్లమని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఇంట్లో రూ.500 తీసుకుని కాలేజీకి వెళ్లిన ప్రసాద్‌.. రాత్రి 11 గంటలకు ఇంటికొచ్చాడు. అనంతరం తాను గడ్డిమందు (పారాక్వాట్‌) తాగానని చెప్పడంతో తల్లిదండ్రులు వెంటనే ప్రసాద్‌ను హుటాహుటిన ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రసాద్‌ పరిస్థితి విషమంగా ఉంది. కాగా, సీరోలు మండలం చింతపల్లిలోని శ్రీ వీరభద్రస్వామి ఫర్టిలైజర్‌ షాపులో రూ.500కు పారాక్వాట్‌ గడ్డిమందు(నిషేధిత) కొన్నట్లు విద్యార్థి ప్రసాద్‌ తెలిపినట్లు తల్లిదండ్రులు చెప్పారు. షాపునకు చెందిన వీరన్న అనే వ్యక్తి (ప్రస్తుతం చింతపల్లి సర్పంచ్‌) మందు విక్రయించినట్లు వివరించారు. ఈ విషయమై సీరోలు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని తెలిపారు. బాలుడి(విద్యార్థి)కి నిషేధిత గడ్డి మందును ఎలా విక్రయిస్తారని ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ విషయమై ఎస్సై సంతోష్‌ను వివరణ కోరగా విద్యార్థి ప్రసాద్‌ గడ్డి మందు తాగినట్లు అతడి తల్లిదండ్రులు ఈనెల 20వ తేదీన ఫిర్యాదు చేశారని తెలిపారు. మందు అమ్మినట్లు చెబుతున్న వీరన్నను అడిగితే తాను అమ్మలేదని చెప్పాడని తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఎస్సై వివరించారు.

గడ్డి మందు తాగిన విద్యార్థి

● పరిస్థితి విషమం

● ఆలస్యంగా వెలుగులోకి ఘటన

నిషేధిత గడ్డిమందు(పారాక్వాట్‌)ను ఎవరు విక్రయించారనే విషయాన్ని పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేయాల్సిన అవసరం ఉంది. మందుల షాపులో నిషేధిత మందు ఎలా వచ్చింది? విద్యార్థికి ఎవరు అమ్మారు? రూ.500కు చింతపల్లిలో కొన్నానని విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వీడియోలో మాట్లాడడం సంచలనం కలిగిస్తోంది. ఎవరు విక్రయించారనే విషయంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటారా? లేదా? కేసు నమోదు చేస్తారా? లేదా? అనే విషయం తెలియాల్సి ఉంది. అధి కార పార్టీకి చెందిన వ్యక్తి షాపులో కొన్నట్లు విద్యార్థి చెబుతుండగా దీనిపై విచారణ చేయాల్సి ఉందని పలువురు పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement