● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: తెలంగాణలోని థర్మల్ పవర్ స్టేషన్లలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరు బృందాలు నేడు(గురువారం) రాష్ట్రంలోని వివిధ పవర్ స్టేషన్లను సందర్శించనున్నాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి బుధవారం తెలిపారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి తాను భూపాలపల్లి జిల్లాలోని కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్‌ను సందర్శించనున్నట్లు చెప్పా రు. పవర్ స్టేషన్‌లో ప్రస్తుత పరిస్థితులు, అక్క డ జరుగుతున్న పరిణామాలను స్వయంగా ప రిశీలించి వాస్తవాలు తెలుసుకుంటామని పే ర్కొన్నారు. థర్మల్ పవర్ స్టేషన్లకు సంబంధించి వెలువడుతున్న వివిధ అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలన అనంతరం పూర్తి వివరాలను ప్రజల ముందుంచుతామని ఎమ్మెల్యే తెలిపారు.
బ్యాంకు అసిస్టెంట్
మేనేజర్ అరెస్ట్
● బంగారు ఆభరణాల అక్రమ తాకట్టు
● ఆన్‌లైన్ బెట్టింగ్, వ్యక్తిగత
అవసరాలకు వినియోగం
మహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలోని ఇండియన్ బ్యాంకులో ఖాతాదారులు తాకట్టుపెట్టిన బంగారు ఆభరణాలను అక్రమంగా ప్రైవేట్ రుణ దాతల వద్ద తాకట్టుపెట్టిన బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్ భూక్యా రాజేశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మహబూ బాబాద్ ఇన్‌చార్జ్ టౌన్ సీఐ అంజలి తెలిపారు. నిందితుడు గతంలో కర్నాటకలోని గుల్బర్గా ప్రాంతంలో బ్యాంకు విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్ప డి అప్పులు చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. అప్పుల ఒత్తిడి కారణంగా మహబూబాబాద్ ఇండియన్ బ్యాంకులో ఖాతాదా రుల బంగారు ఆభరణాలను ప్రైవేట్ రుణదా తల వద్ద తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును తన అవసరాలు, ఆన్ లైన్ బెట్టింగ్‌కు వినియోగించినట్లు తెలిపారు.
బందోబస్తుకు వెళ్లిన ఎస్‌ఐ దుర్మరణం
● హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం
● ఇటీవల కొత్తగూడెం నుంచి
మహబూబాబాద్‌కు బదిలీ


