నగరం జలమయం | - | Sakshi
Sakshi News home page

నగరం జలమయం

Sep 24 2026 2:00 AM | Updated on Sep 24 2026 2:00 AM

నగరం జలమయం

హన్మకొండ: గ్రేటర్‌ వరంగల్‌ నగరంలో బుధవారం కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. వినాయక నిమజ్జనానికి ఈదురు గాలులతో కూడిన వర్షం ఆటంకం సృష్టించింది. కాజీపేట బంధం చెరువు వ ద్ద నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా విద్యుత్‌ వెలుగుల కోసం ఏర్పాటు చేసిన టవర్లు ఈదురు గాలులకు పడిపోయాయి. అధికారులు వెంటనే విద్యుత్‌ సరఫరా నిలిపేసి టవర్లు పునరుద్ధరించారు. హనుమకొండ సుబేదారిలో ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ప్రాంతంలో, అటవీ శాఖ కార్యాలయ సమీపంలో చెట్లు విరిగి విద్యుత్‌ లైన్లపై పడ్డాయి. వరంగల్‌ ఉర్సుగుట్ట సమీపంలో పెద్ద చెట్టు కొమ్మ విద్యుత్‌ లైన్లపై పడింది. గోపాల్‌పూర్‌ సరస్వతి నగర్‌లో టెంట్‌ ఎగిరి విద్యుత్‌ లైన్‌పై పడింది. పలు చోట్ల ఫ్లెక్సీలు పడడంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. హనుమకొండ బస్‌ స్టేషన్‌ ఆవరణలో నీరు నిలవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా, అత్యధికంగా హనుమకొండ జిల్లా నడికూడలో 49.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్‌ జిల్లా గీసుకొండలో 48 మిలీ ్లమీటర్ల వర్షం కురిసింది.

రహదారిపై నిలిచిన నీరు..

కాజీపేట: వర్షం కారణంగా కాజీపేటలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. బాపూజీనగర్‌, జూబ్లీమార్కెట్‌, ప్రశాంత్‌నగర్‌, చైతన్యపురి తదితర కాలనీల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. ఎటుచూసినా కాలువలు పొంగిపొర్లాయి. కాజీపేట చౌరస్తా పక్కనున్న జమామాసీద్‌ గల్లీ నీటితో నిండిపోయింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోని నీటిని తోడి బయట పోసుకున్నారు. డీజిల్‌కాలనీ ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలిచింది. రాత్రి వేళ విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో పట్టణవాసులు ఇబ్బంది పడ్డారు.

హసన్‌పర్తి: హనుమకొండ–కరీంనగర్‌ ప్రధాన రహదారిలోని హసన్‌పర్తి యూనియన్‌ బ్యాంక్‌ సమీపంలో భారీ వృక్షం నేలకొరిగి రోడ్డుపై పడింది. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద చెరువుకు వచ్చే గణేశ్‌ నిమజ్జన వాహనాలు స్తంభించాయి. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌ ఆధ్వర్యంలో సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపైనుంచి చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.

గ్రేటర్‌లో వర్షపు నీటితో నిండిన లోతట్టు ప్రాంతాలు

ఇబ్బందులు పడిన వాహనదారులు, ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement