● తెలంగాణ పవర్ ఎంప్లాయీస్
జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్ శ్రీధర్
హన్మకొండ : విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ ఇనుగాల శ్రీధర్ తెలిపారు. బుధవా రం హైదరాబాద్‌లో యాజమాన్యంతో జేఏసీ ప్రతి నిధులు చర్చలు జరిపినట్లు ఆయన ఒక ప్రకటనలో వివరించారు. ఈ చర్చల్లో ఆర్టిజన్లకు రెగ్యులర్ ఉ ద్యోగులతో సమానంగా అన్ని హక్కులు కల్పించేందుకు యాజమాన్యం ఒప్పుకుందని తెలిపారు. త్వ రలో వేతన సవరణ కమిటీ ఏర్పాటు చేస్తామని హా మీ ఇచ్చిందన్నారు. రిటైర్డ్ అయిన ఈపీఎఫ్ ఉద్యోగులకు వైద్య సౌకర్యం అందించేందుకు అంగీకరించిందని, ఆర్టిజన్లకు ఎపీఎస్‌ఈబీ సర్వీస్ రూల్స్ అమలుపై కమిటీ వేసి నిర్ణయం తీసుకోనున్నట్లు తె లిపారని వివరించారు. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి అతి త్వరలో ప రిష్కరించేందుకు యత్నిస్తామని హామీ ఇచ్చారన్నా రు. సమస్యల పరిష్కారానికి సుముఖత వ్యక్తం చేసిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపించాలి : గోపాల్‌రెడ్డి
నయీంనగర్ : తనను వరంగల్– ఖమ్మం– నల్ల గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిపిస్తే పార్టీలకతీతంగా పనిచేసి వర్కింగ్, రిటైర్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, పట్టభద్రుల సమస్యలు పరిష్కరిస్తానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కుందూరు గోపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం హనుమకొండలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంతకుముందు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఎన్నికై న వారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం గురించి పట్టించుకోక తమ సొంత ప్రయోజనాలను నెరవేర్చుకోడానికే పరిమితమయ్యారని మండిపడ్డారు. రాజకీయ పా ర్టీల అభ్యర్థులు తమ పార్టీల ప్రయోజనాలకే పరి మితమై సమస్యల పరిష్కారాన్ని పట్టించుకోరన్నా రు. దీనిపై నియోజకవర్గ గ్రాడ్యుయేట్‌లు ఆలోచించి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సంఘం నాయకులు కుమారస్వామి, పగడాల సరళ, శేష య్య, వెంకట్ రెడ్డి, సదానందచారి, జగదీశ్వర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు.


