నెహ్రూసెంటర్: వినాయక నిమజ్జనం సందర్భంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని విద్యుత్‌శాఖ జీఎం నోడల్ ఆఫీసర్ విజయేందర్‌రెడ్డి అన్నారు. నిమజ్జన ప్రాంతాలు, చెరువు కట్టలు, మున్నేరువాగు, వినాయక మండపాలను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భారీ విగ్రహాలను తరలించే సమయంలో విద్యుత్ లైన్ల నుంచి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా 8 మీటర్ల విద్యుత్ స్తంభాలను తొలగించి 11 మీటర్ల పోల్స్ వేసే పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిమజ్జన మార్గాల్లో విద్యుత్ లైన్ల ఎత్తు, పోల్స్ స్థితి, లైన్ క్లియరెన్స్ అంశాలను ముందుగానే పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉత్సవ నిర్వాహకులు, ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో డీఈ కోటేశ్వర్‌రావు, ఇన్‌చార్జ్ ఏడీఈ సంగీత, రూరల్ ఏఈ వెంకటేశ్వర్లు, ఏఈ హరీష్ పాల్గొన్నారు.
విద్యుత్‌శాఖ నోడల్ ఆఫీసర్ విజయేందర్‌రెడ్డి


