ఖమ్మంక్రైం: ఖమ్మం జిల్లాలో పలువురు ఎస్సైలను బదిలీ చేస్తూ పోలీసు కమిషనర్ సునీల్‌దత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీఎం బంజర ఎస్సై కె.వెంకటేష్‌ను ఖమ్మం ఖానాపురం హవేలీ ఎస్సైగా, అక్కడి ఎస్సై మధుబాబును మహబూబాబాద్ జిల్లాకు బదిలీ చేశారు. అలాగే, వీఆర్‌లో ఉన్న పి.ప్రదీప్‌ను వేంసూరుకు కేటాయించగా, మహబూ బాబాద్ జిల్లా నుంచి వచ్చిన ఎస్సై షేక్ షకీర్‌ను వీఎం బంజర్ ఎస్సైగా నియమించారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
ఎంపిక
కురవి: మండలంలోని రాజోలు జెడ్పీ హైస్కూ ల్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులు ఆట్యా–పాట్యా క్రీడల్లో రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు పాఠశాల పీడీ కాశీనాఽథ్, హెచ్‌ఎం దామోదర్ తెలిపారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులను శుక్రవారం పాఠశాలలో అభినందించారు. ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు నిర్మల్ జిల్లాలో జరిగే పోటీలకు పాఠశాలకు చెందిన బస్వ మణిచరణ్, బి.రాకేష్, శివ, మాలోత్ రాంచరణ్, మాలోత్ భానుప్రకాశ్, కుర్రి అనిల్ ఎంపికై నట్లు వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్, బీకు, రాజేశ్వరి, కిషన్, వసంత, భవాని, కిరణ్, సతీష్, నరేష్, రజనీరాణి, శ్రీదేవి, రాము, పాఠశాల చైర్‌పర్సన్ ఈశ్వరీ పాల్గొన్నారు.
క్రీడా దినోత్సవం నిర్వహించాలి
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలో నేటి నుంచి ఈ నెల 30వ తేదీ వరకు క్రీడా దినోత్సవం నిర్వహించాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి ఓలేటి జ్యోతి పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా క్రీడల శాఖ అధికారి జ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించి దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్‌రావు, పీడీ నసీరుద్దీన్, తైక్వాండో కోచ్ రాంబాబునాయక్, అథ్లెటిక్ కోచ్ దాక్షినాయక్, పాఠశాల సిబ్బంది యాదగిరి, రమేశ్, సాజిద్, రవి, వెంకన్న, విద్యార్థులు పాల్గొన్నారు.
తాళం వేసి ఉన్న
ఇంట్లో చోరీ
● 3 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5వేల నగదు అపహరణ
గార్ల: తాళం వేసి ఉన్న ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గుంపెళ్లగూడెంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సిద్దబోయిన జోగయ్య గార్ల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తూ పాఠశాల వసతిగృహంలో ఉంటున్నాడు. నాలుగు రోజులకు ఒకసారి తన స్వగ్రామం గుంపెళ్లగూడెం వెళ్లి అక్కడ ఒకరోజు ఉండి వస్తుంటాడు. ఈ క్రమంలో దీనిని గమనించిన దుండగులు శుక్రవారం తెల్లవారుజామున తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని 3 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.5,000 నగదు ఎత్తుకెళ్లారు. ఉదయం ఇరుగుపొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా పగులగొట్టి ఉంది. వెంటనే వారు సమాచారం ఇవ్వడంతో హెచ్‌ఎం జోగయ్య ఇంటికి వెళ్లి చూడగా బీరువాలోని బంగారం, నగదు చోరీకి గురై కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై సాయికుమార్ ఆధారాలు సేకరించారు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


