● పంపింగ్ నిలిపేసిన అధికారులు
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం జీపీ పరిధిలోని గుట్టలగంగారంలో గోదావరి నదిపై ఉన్న దేవాదుల జే. చొక్కారావు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులో ఒక మోటారును గురువారం ఉదయం పంపింగ్ నిలిపి వేశారు. ఎత్తిపోతల వద్ద 3 ఫేజ్‌లలో పది మోటార్లు ఉండగా అందులో ఫేజ్ –1లో రెండు, ఫేజ్–2లో రెండు, ఫేజ్ –3లో ఆరు మోటార్లు ఉన్నాయి. అందులో కొన్నిరోజుల నుంచి ఫేజ్–2లో ఒక మోటారు, ఫేజ్–3లో ఐదు మోటార్లు మొత్తం ఆరు మోట్లాతో పంపింగ్‌ను కొనసాగించిన ఇంజనీరింగ్ అధికారులు.. గురువారం ఫేజ్ –3లోని ఒక మోటారు పంపింగ్‌ను బంద్ చేశారు. ఐదు మోటార్లతో 1,414 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేస్తున్నట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నారు. ఐదు మోటార్లతో దిగువన ఉన్న భీంఘన్‌పుర్ రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నట్లు తెలుస్తోంది. వేసవి కావడంతో తాగు నీటి అవసరాల దృష్టితో దిగువన నీటివినియోగాన్ని బట్టి వివిధ మోతాదుతో నీటిని పంపింగ్ చేస్తున్నట్లు అధికారులు తెలుపుతున్నారు


