వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే చర్యలు

Apr 8 2026 7:26 AM | Updated on Apr 8 2026 7:26 AM

కలెక్టర్‌ స్నేహ శబరీష్‌

తొర్రూరు: జిల్లాలోని అన్నివర్గాల ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. మంగళవారం డివిజన్‌ కేంద్రంలోని ప్రభుత్వ హెల్త్‌ సెంటర్లు, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి, బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వైద్యులు, సిబ్బంది పని తీరు, హాజరుశాతాన్ని పరిశీలించారు. అలాగే బాలికల గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల పనితీరు, పాఠశాల నిర్వహణ, విద్యార్థుల సామర్థ్యాలపై ఆ రా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని సబ్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రతీ ఒక్కరికి వైద్య సేవలు నిరంతరం అందించాలని, అవసరమైతే వైద్య శిబిరాలను నిర్వహిస్తూ అన్నివర్గాల ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని సూచించారు. అనంత రం బాలికల గురుకుల పాఠశాలలో ఏఐ ద్వారా తరగతులు నిర్వహిస్తూ ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ గణేష్‌, డీసీఓ జయశ్రీ, ప్రిన్సిపాల్‌ రత్నమాల, ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ సుగుణాకర్‌రాజు, నందనాదేవి, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్యాంసుందర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: ప్రభుత్వ పథకాలు అర్హులకు చేరేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మంగళవారం పరిశ్రమలు–పెట్టుబడుల ప్రమోషన్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. టీఫ్రైడ్‌ తెలంగాణ ఐపాస్‌ వంటి పథకాలతో ఎస్సీ, ఎస్టీ యువతకు ఉపాధి అవకాశాలు క ల్పించి, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలన్నారు. టీజీఐపాస్‌ చట్టం కింద వివిధ శాఖల నుంచి అనుమతులు పొందేందుకు 30యూనిట్లు రూ. 36.90 కోట్ల పెట్టుబడితో దరఖాస్తు చేసుకున్నట్లు తెలి పా రు. అందులో కొన్నింటి అనుమతులు మంజూరు అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ శ్రీమన్నారాయణరెడ్డి, విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ విజయేందర్‌రెడ్డి, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు దేశీరాంనాయక్‌, శ్రీనివాస్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement