మూడేళ్లుగా మంచానికే పరిమితం | - | Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా మంచానికే పరిమితం

Mar 1 2026 8:04 AM | Updated on Mar 1 2026 8:04 AM

మూడేళ

మూడేళ్లుగా మంచానికే పరిమితం

హన్మకొండ చౌరస్తా: రెక్కల కష్టమే పెట్టుబడిగా పెట్టి కుటుంబాన్ని కంటికి రెప్పలా సాకుతున్న ఓ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయప డ్డాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అత డి భవిష్యత్‌ అంధకారంగా మారింది. కొడుకుకు జరిగిన ప్రమాదం చూసి తట్టుకోలేక తల్లి ప్రేమలీల మనోవేదనతో అనారోగ్యానికి గురై ఏడాదికే చని పోయింది. యువకుడి తండ్రి బాబు మేసీ్త్ర పని చేసి కొడుకు, కోడలు, మనువళ్లను కొంతకాలం సాకా డు. ఇప్పుడు అతడు కూడా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో ఏమి చేయలేని దుస్థితిలో కన్నీళ్లును దిగమింగుతూ జీవితం గడుపుతున్నాడు. వివరాల్లో కి వెళ్తే.. వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి హవేలీకి చెందిన మైదం ప్రవీణ్‌ పేదరికంతో చదువు మధ్యలో (డిగ్రీ)నే ఆపేశాడు. ప్రవీణ్‌కు భా ర్య మౌనిక, పిల్లలు రేచల్‌శ్రేష్ట, సాహస్‌ప్రిన్స్‌, ప్రశస్థ ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ పోషణ నిమి త్తం ప్రతీ రోజు వరంగల్‌కు వచ్చి హమాలీ పనిచేసి తిరిగి ఇంటికెళ్లేవాడు. 2022లో పని ముగించుకుని వరంగల్‌ నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. మొగి లి చర్ల క్రాస్‌ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని వెళ్లింది. తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ను అక్కడే ఉ న్న వారి సాయంతో అంబులెన్స్‌లో ఎంజీఎం తరలించారు. ఇక్కడ ఏడాది పాటు చికిత్స పొందిన ప్ర వీణ్‌ను మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. అక్కడ పది రో జులు అబ్జర్వేషన్‌లో ఉంచిన వై ద్యులు హైదరాబా ద్‌ నిమ్స్‌ తీసుకెళ్లాని సూచించారు. పరీక్షలు చేసిన నిమ్స్‌ వైద్యులు స్పైనల్‌కార్డ్‌ సర్జరీ చే యాలన్నారు. అయితే అప్పటికే ప్రవీణ్‌ చాతీలో రక్తం గడ్డకట్టిందని, కొంత సమయం పడుతుందని చెప్పారు. ఆర్థికభారం భరించలేక ఇంటికి చేరుకున్నారు.

సర్జరీకి రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ..

సర్జరీకి రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపినట్లు ప్రవీణ్‌ కన్నీరుమున్నీరవుతూ తెలిపాడు. నిరుపేద దళిత కుటుంబానికి చెందిన ప్రవీణ్‌కు ఆర్థిక స్థోమత లేకపోవడంతో సర్జరీ నిలిచిపోయింది.

పిల్లలతోపాటు భర్తకూ నిరంతరం సేవలు.

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రవీణ్‌ మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యాడు. భార్య మౌనిక తన ముగ్గురు చిన్న పిల్లలతో సహా ప్రవీణ్‌ ను సైతం పాపలా చూసుకుంటుంది. జీఎన్‌ఎం నర్సింగ్‌ చేసిన మౌనిక ప్రైవేట్‌ ఉద్యోగం చేద్దామంటే పిల్లలు, భర్తను చూసుకునేవారు లేక ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి అంటూ బాధితుడు కన్నీటి పర్యంతమవుతున్నాడు.

కనికరించని కార్మికశాఖ ..

ప్రవీణ్‌ కార్మికశాఖ గుర్తింపు కార్డు కలిగి ఉన్నాడు. ఆ శాఖ నిబంధన ప్రకారం గుర్తింపు కార్డు కలిగిన వ్యక్తులు రోడ్డు ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యం పొందితే రూ. 3 లక్షల నుంచి రూ.4 లక్షల నష్టపరిహారం చెల్లించాలి. ప్రవీణ్‌ అంగవైకల్యం పొంది నట్లు ఎంజీఎం వైద్యులు ధ్రువీకరించిన తాత్కాలిక సర్టిఫికెట్‌ కార్మికశాఖలో అప్పగించారు. అయినా అధికారులు నిబందనల పేరుతో ఏడాదిగా తిప్పించుకుంటున్నారని ప్రవీణ్‌ భార్య మౌనిక కన్నీటి ప ర్యంతమవుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు , ప్రజాప్రతినిధులు స్పందించి కార్మికశాఖ ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని వేడుకుంటుంది.

యువకుడి భవిష్యత్‌ అంధకారం

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు

ఏడాదిగా కార్మికశాఖ చుట్టూ ప్రదక్షిణ

నిబంధనల పేర దరఖాస్తు తిరస్కరణ

ఆదుకోవాలని కుటుంబం వేడుకోలు

దాతలు ఆదుకోండి..

‘మూడు సంవత్సరాలుగా తీవ్ర అవస్థలు పడుతున్నాం, దయచేసి తమను ఆదుకోవాలి’ అని ప్రవీణ్‌, అతడి భార్య మౌనిక చేతులెత్తి వేడుకుంటున్నారు. ఆర్థిక సాయం చేయాలనుకునే దాతలు గూగుల్‌పే, ఫోన్‌పే నంబర్‌ 90006 85709 తోపాటు ప్రవీణ్‌ బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ 520191056074030 యూనియన్‌ బ్యాంకు, ఊకల్‌ హవేలీ బ్రాంచ్‌, IFSC CODE NO : UBIN 0903027 నంబర్‌కు పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మూడేళ్లుగా మంచానికే పరిమితం 1
1/2

మూడేళ్లుగా మంచానికే పరిమితం

మూడేళ్లుగా మంచానికే పరిమితం 2
2/2

మూడేళ్లుగా మంచానికే పరిమితం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement