బాలవికాస సేవలు ఆదర్శనీయం
కాజీపేట రూరల్ : బాలవికాస సేవలు ఆదర్శనీయమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. శనివారం కాజీపేట ఫాతిమానగర్‌లోని బాలవికాసలో తాగునీటి శుద్ధీకరణ పథకాల కమిటీల మహాసభ నిర్వహించారు. ఎమ్మెల్యేలు నాయిని రా జేందర్‌రెడ్డి, కె.ఆర్.నాగరాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపీ కావ్య ము ఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ నీరు జీవనానికి అత్యవసరమన్నారు. బాలవికాస వెంట ఉంటే గ్రామం ఆదర్శంగా మారుతుందన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ సమాజంలో బాలవికాస వివిధ రకాల సేవలు, అభివృద్ధి ఆదర్శనీయమన్నారు. వర్ధన్నపేట ఎ మ్మెల్యే కె.ఆర్.నాగరాజు మాట్లాడుతూ నేటికి పరి శుభ్ర తాగునీరు అందుబాటులో లేని ప్రజలు ఇంకా ఉన్నారని, అలాంటి వారికి సేవ చేయడం గొప్ప అన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ బాలవికాస సమాజ హిత కార్యక్రమాలు అభినందనీయమన్నారు. గ్రామాల్లో నీటి శుద్ధికరణ కేంద్రాలకు ఉచిత విద్యుత్ కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు మాట్లాడుతూ బాలవికాస వ్యవస్థాపకురాలు బాలథెరిసా సేవలు అద్భుతమని, బాలవికాస ప్రాజెక్ట్‌లు ప్రజలకు ఎంతో ఉపయోగకరమన్నారు. బాలవికాస వ్యవస్థాపకురాలు బాలథెరిసా జింగ్రాస్ కెనడా నుంచి ఆన్‌లైన్‌లో మాట్లాడుతూ బాలవికాస ఈ రోజు 1,600 మంది సభ్యులు, అన్ని గ్రామాలు కలిసి ఒకే కుటుంబంగా మారడం గొప్ప విషయమన్నారు. ఈ కుటుంబాన్ని ఐక్యంగా నిర్మించారన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు డాక్టర్ టి.రాజయ్య, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, బాలవికాస ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సింగారెడ్డి శౌరిరెడ్డి, బాలవికాస సిబ్బంది, పలు రాష్ట్రాలకు చెందిన 3వేల మంది కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య
తాగునీటి శుద్ధ్ధీకరణ పథకాల
కమిటీల మహాసభ
బాలవికాస సేవలు ఆదర్శనీయం


