వృత్తి డీటీఓ.. ప్రవృత్తి చిత్రకళ | - | Sakshi
Sakshi News home page

వృత్తి డీటీఓ.. ప్రవృత్తి చిత్రకళ

Mar 1 2026 8:04 AM | Updated on Mar 1 2026 8:04 AM

వృత్త

వృత్తి డీటీఓ.. ప్రవృత్తి చిత్రకళ

మహబూబాబాద్‌: వృత్తి పరంగా ఓ శాఖలో ఆయన ఉన్నతాధికారి. (డీటీఓ, డిస్ట్రిక్ట్‌ ట్రెజరరీ ఆఫీసర్‌). ప్రవృత్తి పరంగా చిత్ర కళాకారుడు (బొమ్మలు గీయ డం). ఈ రెండు రంగాలకు ఎలాంటి సంబంధం లే దు. నిత్యం ఎన్నో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశంతో ముడిపడిన ఉద్యోగం చేస్తున్న ఆయనకు చిన్నప్పటి నుంచే చిత్రకళపై మక్కువ ఏర్పడింది. అప్పటి నుంచే పలకపై బొమ్మలు గీయడం మొదలు పెట్టారు. అనంతరం చిత్రకళ విద్యనభ్యసించి పలు చిత్రాలు గీసి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పలు బహుమతులు అందుకున్నారు. ఆయనే మానుకోట డీటీఓ వెంటపల్లి సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం కందుల పాలెం గ్రామానికి చెందిన వెంటపల్లి సత్యనారాయణ ఎంఏ(చరిత్ర) పూర్తి చేశారు. 1994 డీఎస్సీలో ఎంపికై రెండేళ్ల పాటు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌–2లో ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. అనంతరం ఖమ్మం జిల్లా ఖజానా శాఖలో సీనియర్‌ గణంక అధికారిగా విధులు నిర్వర్తించారు. తర్వాత ఉప ఖాజానాధికారిగా, సహాయ ఖజానాధికారి, ఆ తర్వాత ప్రమోషన్‌తో ఖమ్మం జిల్లాలోనే జిల్లా ఖజానాధికారిగా పని చేశారు. 2024 ఆగస్టులో మానుకోటకు బదిలై డీటీఓగా కొనసాగుతున్నారు.

కరోనాపై కార్టున్లు గీసి.. అవగాహన కల్పించి

కరోనా సమయంలో100కుపైగా కర్టూన్లు గీయడంతో పాటు వాటికి సంబంధించిన 600 పుస్తకాలు ప్ర చురించి పంపిణీ చేసి అవగాహన కల్పించారు. వా టితోపాటు రూప దీప్తి, చిత్రదీప్తి, కళాదీప్తి (తెలుగు చిత్ర కళా సౌరభాలు) పేరుతో పుస్తకాలు రాశారు.

2వేలకు పైగా కార్టున్లు..

సత్యనారాయణ సుమారు 200 మంది చిత్రకారులను ప్రపంచానికి పరిచయం చేశారు. 2,000 పైగా కార్టున్లు వేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయంగా కూడా బహుమతులు పొందారు. 2020లో నార్వేలో జరిగిన ప్రపంచ కార్టున్‌ పోటీల్లో దేశం నుంచి పాల్గొని మొదటి బహుమతి సాధించారు. అలాగే, మొత్తం 20కిపైగా రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు సాధించారు.

కళారంగంలో తనదైన ముద్ర వేస్తున్న వెంటపల్లి సత్యనారాయణ

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన డీటీఓ

వృత్తి డీటీఓ.. ప్రవృత్తి చిత్రకళ1
1/1

వృత్తి డీటీఓ.. ప్రవృత్తి చిత్రకళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement