తల్లి అనుమతితోనే గద్దైపెకి సారలమ్మ
ఎస్‌ఎస్‌తాడ్వాయి/ఏటూరునాగారం: తల్లి అనుమతి తీసుకున్న తర్వాతనే మేడారంలో గద్దైపె సారలమ్మ కొలువుదీరనుంది. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మను పూజారులు నేరుగా మేడారంలోని గద్దైపెకి తీసుకెళ్లకుండా సమ్మక్క గుడికి చేరుకుంటారు. గుడిలో సారలమ్మ పీఠానికి ముగ్గులు వేసి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈసందర్భంగా సమ్మక్క పూజారులు కట్టడి చేసి కంకణాలు కట్టి శాంతింపజేసిన తర్వాత సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులును గద్దెలపైకి తీసుకెళ్లి ప్రతిష్ఠిస్తారు. సమ్మక్క గుడికి పగిడిద్దరాజు రావడంతో పెళ్లి తంతు జరిపిస్తారు.
నేడు చిలకలగుట్ట వద్ద పూజలు
మేడారం చిలకలగుట్ట వద్ద సమ్మక్క పూజారులు పూజలు నిర్వహించనున్నారు. గురువారం తల్లి గద్దైపెకి రానుంది. ఈ నేపథ్యంలో సమ్మక్క పూజారులు బుధవారం గుట్టపైకి వెళ్లి తల్లిని శాంతింపజేసేందుకు కోళ్లను సమర్పించి పూజలు చేస్తారు. గుట్ట దారిని శుభ్రం చేసి తల్లి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తారు.
తల్లి అనుమతితోనే గద్దైపెకి సారలమ్మ


