ఎస్సార్‌లో కేరింతలు..
● శ్రీరామ్ చంద్ర పాటలు..
విద్యార్థుల డ్యాన్స్‌లు
● సందడి చేసిన ప్రోనైట్
● ముగిసిన స్పార్క్రిల్ వేడుకలు
హసన్‌పర్తి: విద్యార్థుల కేరింతల నడుమ స్పార్క్రిల్ –26 వేడుకలు సోమవారం ఘనంగా ముగిశాయి. హసన్‌పర్తి మండలం అన్నాసాగరం శివారులోని ఎస్సార్ యూనివర్సిటీలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించారు. చివరిరోజు ప్రముఖ నేపథ్య గాయకుడు శ్రీరామ్ చంద్ర ప్రదర్శన అది రింది. శ్రీరామ్ చంద్ర ప్రోనైట్ కార్యక్రమం విద్యార్థుల్లో జోష్ నింపింది. వేదికపై శ్రీరామ్‌చంద్ర స్టేప్ లు వేస్తూ పాటలు పాడుతుండగా విద్యార్థులు డ్యాన్స్‌లు చేశారు. అంతకు ముందు డ్యాన్స్ మాస్టర్ పండు ప్రదర్శన ఆకట్టుకుంది. తొలుత విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరించాయి. ఎస్సార్ యూనివర్సిటీ చాన్స్‌లర్ ఎ.వరదారెడ్డి, ప్రో వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వి.మహేష్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వెంకటరమణారావు, డీన్–ఆపరేషన్ అండ్ గ్రోత్ ప్రొఫెసర్ డాక్టర్ అర్చనారెడ్డి, డీన్ స్టూడెంట్స్ అఫైర్స్ డాక్టర్ ఎ.వి.వి. సుధాకర్, డాక్టర్ దీప పాల్గొన్నారు.
సుమతిరెడ్డిలో ‘శ్రీధం’ వేడుకలు
నగర శివారులోని సుమతిరెడ్డి మహిళాఇంజనీరింగ్ కళాశాలలో శ్రీధం–2026 వేడుకలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎస్సార్ విద్యా సంస్థల చైర్మన్ ఎ.వరదారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా విద్యార్థినుల సాంప్రదాయ వస్త్రధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమాన్ని పురస్కరించుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రత్యేక పంటలను విద్యార్థినులు తయారు చేసి ప్రదర్శించారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిని ప్రతిబింబించే బోనాల పండుగ ప్రధా న ఆకర్షణగా నిలిచింది. ఉగాది, కృష్ణాష్టమి, రంజా న్, క్రిస్మస్ వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం విద్యార్థినులు ర్యాంప్ వాక్ చేశారు. ఈసందర్భంగా ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి మాట్లాడుతూ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనే భావనకు నిలువెత్తు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో సుమతిరెడ్డి మహిళాఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజశ్రీరెడ్డి, కార్యక్రమ కోఆర్డినేటర్ డాక్టర్ జి.ఝాన్సీరాణి, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ కుమారస్వామి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ శ్రీవాణి, ఏఓ వేణుగోపాలస్వామి, విద్యార్థి కో–ఆర్డినేటర్లు అర్చన, వర్షిత, సరయు,తన్మయి, అక్షయరెడ్డి, శ్రీజ పాల్గొన్నారు.
డ్యాన్స్ చేస్తున్న పండు మాస్టర్
వరదారెడ్డిని సన్మానిస్తున్న కళాశాల సిబ్బంది
ఎస్సార్‌లో కేరింతలు..
ఎస్సార్‌లో కేరింతలు..


