భక్తులకు ఇబ్బంది కలగకుండా రవాణా సేవలు
హన్మకొండ: మేడారం భక్తులకు ఇబ్బంది కలగకుండా మెరుగైన రవాణా సేవలు అందించాలని టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి అన్నారు. సోమవారం వరంగల్ ములుగు రోడ్‌లోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో ఈడీ, ఆర్‌ఎంలు, సీనియర్, జూనియర్ స్కేల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్ల మేడారం సన్నద్ద సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చివరి ప్రయాణికుడికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా రవాణా సౌకర్యాలు అందించడమే టీజీఎస్ ఆర్టీసీ లక్ష్యమని తెలిపారు. వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ టీజీఎస్ ఆర్టీసీకి పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. జగిత్యాల ఎస్పీ, ఆర్టీసీ మేడారం బేస్ క్యాంపు ఇన్‌చార్జ్ అశోక్ కుమార్ మాట్లాడుతూ భక్తులకు రవాణ విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులతో సమన్వయంగా పనిచేస్తామని తెలిపారు. సమిష్టి పని చేసి మేడారం జాతరను విజయవంతం చేద్దామన్నారు.
మరిపెడ రూరల్: మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం భూక్యతండాకు చెందిన పర్వతారోహకుడు భూక్య యశ్వంత్ మరో ప్రతిభ చాటాడు. హైదరాబాద్‌కు చెందిన యువ సినీ బృందం రూపొందించిన షార్ట్ డాక్యుమెంటరీ ‘రియో ది డేంజరస్ పిక్’ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ 30 నిమిషాల షార్ట్ డాక్యుమెంటరీ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (డీపీఐఎఫ్‌ఎఫ్)–2026కి అధికారికంగా ఎంపికై ంది. ఈ చిత్రం ఒకే సమయంలో పర్వతారోహకుడి సాహసాన్ని, దర్శకుడి ప్రతిభ, అలాగే నిర్మాణ సంస్థ విజన్‌ను సమానంగా ప్రతిబింబిస్తుంది. ఈ డాక్యుమెంటరీలో ప్రధాన పాత్ర యశ్వంత్ నాయక్ పోషించాడు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌లో 6,816 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ రియో పర్గ్యల్ పర్వతాన్ని అధిరోహిస్తున్న క్రమంలో యశ్వంత్ సాహసం, సంకల్పం గుర్తించి ఎస్‌కేఐ ప్రొడక్షన్ ప్రతినిధులు ఈ డాక్యుమెంటరీ రూపొందించారు.
వెంకటాపురం(కె): తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులోని కర్రెగుట్టల్లో సోమవారం సీఆర్‌పీఎఫ్ బలగాలు మావోయిస్టులు అమర్చిన రెండు బాంబులను నిర్వీర్యం చేసినట్లు తెలుస్తోంది. కర్రెగుట్టల్లోని పామునూరులో ఏర్పాటు చేసిన బేస్ క్యాంపు బలగాలు గ్రామ సమీపంలో సెర్చ్ చేస్తున్న క్రమంలో రెండు మందు పాతరలను గుర్తించి నిర్వీర్యం చేసినటు సమాచారం.
వృద్ధుడి ప్రాణం తీసిన
ప్రేమవివాహం తగువు
బయ్యారం: మనమరాలి ప్రేమవివాహం తగువు తాత ప్రాణం తీసింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ముస్తాఫానగర్‌కు చెందిన షేక్ సైదులు(67) తన మనమరాలు సంవత్సరం క్రితం ప్రేమవివాహం చేసుకోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. అయితే మనమరాలిని ఇంటికి తీసుకొచ్చే విషయంలో సైదులు దంపతులకు ఇటీవల తగువు జరిగింది. ఈ ఘటనతో మనస్తాపం చెందిన సైదులు.. ఈ నెల 20న గడ్డిమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబీకులు గమనించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడి కుమారుడు చాంద్‌పాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.
భక్తులకు ఇబ్బంది కలగకుండా రవాణా సేవలు
భక్తులకు ఇబ్బంది కలగకుండా రవాణా సేవలు


