ఇంటినుంచే తపాలా సేవలు | - | Sakshi
Sakshi News home page

ఇంటినుంచే తపాలా సేవలు

Aug 26 2025 8:43 PM | Updated on Aug 26 2025 8:43 PM

ఇంటిన

ఇంటినుంచే తపాలా సేవలు

పోస్టల్‌ సర్వీసులకు కొత్త సాఫ్ట్‌వేర్‌

కాలానుగుణంగా

మార్పులు..

సేవలన్నీ ఆన్‌లైన్‌లో అందిస్తాం..

ఖిలా వరంగల్‌ : ఆన్‌లైన్‌ సౌకర్యం లేని కాలంలో తపాలా శాఖ ప్రజలకు అ త్యుత్తమ సేవలు అందించింది.. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ కాల్‌ లెటర్‌ రావాలన్నా.. ఉద్యోగం వచ్చిందన్న సమాచారం తెలుసుకోవాలన్నా.. బంధుమిత్రులకు వర్తమానం, సంస్థలు, కార్యాలయాలకు ముఖ్యమైన ధ్రు వీకరణ పత్రాలు పంపాలన్నా.. ఒకప్పుడు పోస్టల్‌ సేవలు ప్రధాన ఆధారం. ప్రసుత్తం వినియోగదారుడు ఉన్న చోటు నుంచే తపాలా సేవలు పొందేలా అధునాతన సౌకర్యాలు కల్పించింది. ఇటీవల తీసుకొచ్చిన సాఫ్ట్‌వేర్‌తో సాంకేతిక అనుసంధానం చేసి దేశీయ, విదేశీయ లెటర్లు, పార్సల్‌ బుకింగ్‌, స్పీడ్‌ పోస్ట్‌ అన్నీ స్వీయ–సేవ పోర్టల్‌ వెబ్‌ ఆధారంగా పోస్టాఫీసుకు వెళ్లకుండానే ఇంటి నుంచే సులభంగా తపాలా సేవలు పొందవచ్చు.

india post.gov.in /customer&eltservice/ login యూజర్‌ ఐడీ, మొబైల్‌ ఓటీపీ, కస్టమర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా లెటర్లు, పార్సల్స్‌, స్పీడ్‌ పోస్ట్‌లు అన్ని ఇంటి వద్దే పొందొచ్చు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేయగానే పోస్ట్‌మెన్‌ వినియోగదారుల ఇంటికి చేరుకుని స్పీడ్‌పోస్ట్‌ సేవలు, పార్సిల్స్‌ సేకరించి ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ విధానంతో గమ్యానికి చేరవేయనున్నారు.

సేవలన్నీ ఒకే గొడుగు కిందికి..

తపాలా కార్యాలయాల ద్వారా అందించే సేవలన్ని ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చింది. నూతన ఐటీ 2.0 పేరుతో కొత్త సాఫ్ట్‌వేర్‌తో డేటా భద్రతతోపాటు సిస్టమ్‌ స్పీడ్‌ సామర్థ్యం పెంచారు. వరంగల్‌ డివిజన్‌ ప్రధాన కార్యాలయ పరిధిలో వరంగల్‌, మహబూబాబాద్‌ హెడ్‌ పోస్టాఫీసులు ఉండగా.. 42 సబ్‌ పోస్టాఫీసులు, 362 గ్రామీణ పోస్టాఫీసులు ద్వారా వినియోగదారులు తపాలా సేవలు పొందుతున్నారు.

రిజిస్టర్డ్‌ పోస్ట్‌ స్పీడ్‌ పోస్ట్‌లో విలీనం..!

స్మార్ట్‌ ఫోన్లు, ఆన్‌లైన్‌ సౌకర్యాలు లేని రోజుల్లో రిజిస్టర్డ్‌ పోస్ట్‌ ప్రజల జీవితాలతో విడదీయరాని బంధాన్ని ఏర్పర్చుకుంది. ముఖ్యమైన పత్రాలు, వస్తువులను సురక్షితంగా, నమ్మకంగా పంపించడానికి ఇదే ప్రధాన మార్గంగా నిలిచింది. అయితే సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి రిజిస్టర్డ్‌ పోస్ట్‌ సేవలు నిలిపి వేస్తున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది. స్పీడ్‌ పోస్ట్‌లోకి రిజిస్టర్డ్‌ పోస్ట్‌ సేవలను విలీనం చేసి.. ఇంకా మెరుగైన సేవలు అందించనున్నది.

సాంకేతిక వ్యవస్థతో అనుసంధానం

స్వీయ–సేవ పోర్టల్‌ వెబ్‌ ఆధారిత

బుకింగ్‌ సౌకర్యాలు

1 నుంచి రిజిస్టర్డ్‌ పోస్టుకు మంగళం..

స్పీడ్‌పోస్ట్‌లో విలీనం

మారుతున్న కాలానికి అనుగుణంగా తపాలాశాఖ కూడా మారుతోంది. ప్రైవేట్‌ సంస్థలకు దీటుగా ఇప్పటికే ఎన్నో సేవలతో అధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పోస్టల్‌ శాఖ అంతే వేగంగా స్పీడ్‌ పోస్ట్‌ విధానానికి శ్రీకారం చుడుతోంది. బ్రిటిష్‌ కాలం నుంచి కొనసాగుతున్న రిజిస్టర్డ్‌ పోస్ట్‌ సేవలను స్పీడ్‌ పోస్ట్‌లో కలుపుతున్నట్లు భారత తపాలా శాఖ ప్రకటించింది.

అధునాతన పరిజ్ఞానంతో ఖాతాదారులకు ఆన్‌లైన్‌ సేవలు అందిస్తున్నాం. ప్రైవేట్‌కు దీటుగా సేవలు అందించాలన్న లక్ష్యంతో నూతన విధానం అమల్లోకి తెస్తున్నాం. 1వ తేదీనుంచి రిజిస్టర్డ్‌ పోస్ట్‌ సేవలన్నీ స్పీడ్‌ పోస్ట్‌లో విలీనం చేసి ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ ద్వారా సేవలు అందిస్తాం. ప్రజలు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసిన ప్రతీ సేవను పది నిమిషాల వ్యవధిలో పోస్ట్‌మన్‌ మీ ఇంటికి చేరుకొని సేవలు అందిస్తారు. ఖాతాదారులు తమ ఇంటివద్ద తపాలా సేవలన్నీ పొందేలా చర్యలు తీసుకున్నాం. – రవికుమార్‌, తపాలాశాఖ, డివిజనల్‌ సూపరింటెండెంట్‌, వరంగల్‌

ఇంటినుంచే తపాలా సేవలు1
1/2

ఇంటినుంచే తపాలా సేవలు

ఇంటినుంచే తపాలా సేవలు2
2/2

ఇంటినుంచే తపాలా సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement