
కమీషన్ డబ్బులు వెంటనే చెల్లించాలి
హన్మకొండ అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల కమీషన్ డబ్బులు వెంటనే చెల్లించాలని రేష న్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్‌బాబు డిమాండ్ చేశారు. సోమవారం సంఘం నాయకులతో కలిసి హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డికి రేషన్ డీలర్ల సమస్యలపై ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ సెప్టెంబర్ 5న బంద్ పాటించనున్నట్లు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా డీలర్లకు కనీస గౌరవ వేతనం రూ.5 వేలు, కమీషన్ పెంపు, ఏ నెల కమీషన్ ఆ నెలలోనే చెల్లించాలని కోరారు. అలాగే, రేషన్ షాపులను మినీ సూపర్ మార్కెట్లుగా గుర్తించాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హనుమండ్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, కోశాధికారి కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, శ్రీనివాస్, రవీందర్, వెంకటేష్, రాము, మోహన్, నాయకులు నర్సయ్య, భానుచందర్,దామోదర్, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
సెప్టెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా
రేషన్ షాపులు బంద్