
బోదకాలు వ్యాప్తిని అరికట్టాలి
కొత్తగూడ: బోదకాలు వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామస్తులు సహకరించాలని డబ్ల్యూహెచ్‌ఓ ప్రతినిధి డాక్టర్ శిరీష కోరారు. మండలంలోని వేలుబెల్లిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. బోదకాలు దోమ కాటు వల్ల వస్తుందన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన మందులు ప్రతీ ఒక్కరు వేసుకోవాలని సూచించారు. మందుల వాడకం వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదని, వ్యాఽధి కారక క్రీములు ఉన్న వ్యక్తుల్లో కొద్దిపాటి ఇబ్బందులు ఏర్పడతాయని అవగాహన కల్పించారు. వాటి వల్ల ఎలాంటి ఇబ్బందులు రావన్నారు. మాజీ సర్పంచ్ వజ్జ వెంకటలక్ష్మి, గంగారం పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రత్యూష, సుధీర్‌రెడ్డి, పీహెచ్‌సీ సిబ్బంది పాల్గొన్నారు.