
పీహెచ్‌సీలకు నోడల్ అధికారి నియామకం
గార్ల: జిల్లాలోని 9 పీహెచ్‌సీలకు ప్రభు త్వ నోడల్ అధికారిగా గంధంపల్లి పీహెచ్‌సీ డాక్టర్ రాజ్‌కుమార్‌ను నియమిస్తూ శనివారం డీఎంహెచ్‌ఓ రవి రాథోడ్ ఉత్వర్వులు జారీచేశారు. జిల్లాలోని బ య్యారం, గార్ల, గంగారం, కొత్తగూడ, అయోధ్యపురం, గంధంపల్లి, కోమట్లగూడెం, తీగలవేణి, ముల్కనూరు పీహెచ్‌సీల పరిధిలో నిర్వహించే జాతీ య ఆరోగ్య మిషన్, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల అమలు తీరుతెన్నులను రాజ్‌కుమార్ పరిశీలించనున్నారు. విషజ్వరాలు, సీజనల్ వ్యాధులు ప్రభలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక నోడల్ అధికారి అవగాహన చర్యలు చేపట్టనున్నారు.