
సంఘాలను మరింత పటిష్టం చేయాలి
హన్మకొండ: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను మరింత పటిష్టం చేయాలని తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు అన్నారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, డీసీసీబీలు, టెస్కాబ్ పాలకవర్గాలకు ప్రభుత్వం ఆరు నెలలు పొడిగింపు ఇచ్చిన సందర్భంగా శుక్రవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చిత్రపటాలకు పాలక వర్గంతో కలిసి రవీందర్ రావు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు సేవ చేసేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందన్నారు. వరంగల్ డీసీసీబీని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తామన్నారు. వ్యవసాయ రంగానికి సేవలు విస్తృతం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీసీ బ్యాంక్ డైరెక్టర్లు హరిప్రసాద్, మాడుగుల రమేష్, దొంగల రమేష్, ఎరబ్రెల్లి గోపాలరావు, మురళి, సంపెల్లి నరసింగరావు, నరేందర్ రెడ్డి, పోలపాక శ్రీనివాస్, సొసైటీ చైర్మన్లు రాజేష్ ఖన్నా, రామచంద్ర రావు, లక్ష్మారెడ్డి, దేవేందర్‌రావు, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ గౌడ్, డీసీసీబీ సీఈఓ వజీర్ సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.
టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు