
విద్యుదాఘాతంతో విద్యార్థికి గాయాలు
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాట మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థిని దైనంపల్లి సిరి తొమ్మిదో తరగతి చదువుతుంది. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వేడుకల ఏర్పాట్లలో భాగంగా స్టీల్ పైప్‌తో కూడిన జెండాలను పట్టుకుని వెళ్తున్న క్రమంలో పాఠశాల ఆవరణలో విద్యుత్ తీగలకు తగిలింది. దీంతో విద్యార్థిని సిరి చేతికి, కాలుకు గాయాలు అయ్యాయి. గమనించిన పాఠశాల సిబ్బంది హూటహూటిన స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించా రు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మేరకు కారుకులైన వారిపై చర్యలు తీసుకోవాలని పలు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం ఆస్పత్రిలో ఉన్న బాలికను పరామర్శించారు.

విద్యుదాఘాతంతో విద్యార్థికి గాయాలు