
దంత వైద్యశిబిరానికి స్పందన
హన్మకొండ చౌరస్తా: భారత స్వాతంత్య్ర దినోత్సవం, ఎస్‌వీఎస్ దంత వైద్యశాల 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హనుమకొండ చౌరస్తాలోని దంత ఆస్పత్రిలో శుక్రవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని అనూహ్య స్పందన లభించిందని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్ గిరిధర్‌రెడ్డి పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, టూత్‌పేస్టులు, మౌత్ వాష్‌లు అందజేశారు. దంతాల పరిరక్షణపై ప్రతిఒక్కరూ దృష్టి సారించాలని సూచించారు. వైద్య శిబిరంలో వైద్యులు గణేష్, హారిక, సిబ్బంది యాకూబ్‌రెడ్డి, సౌమ్య, చంద్రిక, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.