
డెంగీతో బాలిక మృతి
వేలేరు: డెంగీ జర్వంతో బాలిక మృతి చెందింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సూత్రపు రమేష్ కూతురు శాన్విక(7)కు ఐదు రోజల క్రితం జర్వం రాగా చికిత్స నిమిత్తం హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానాకు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు డెంగీగా గుర్తించి చికిత్స చేస్తున్న క్రమంలో శుక్రవారం ఉదయం మృతిచెందింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు.