
పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం
● ఏర్పాట్లను పరిశీలించిన
ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
మహబూబాబాద్ అర్బన్: పంద్రాగస్టు వేడుకలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో చేపట్టిన ఏర్పాట్లను గురువారం ఇన్‌చార్జ్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పంద్రాగస్టు వేడుకలకు ముఖ్యఅతిథిగా డిప్యూటీ స్పీకర్ రామచంద్రునాయక్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారన్నారు. వీఐపీలు, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజాప్రతినిధులు కూర్చునే విధంగా ఏర్పాట్లు చేయాలని, వాటర్ ఫ్రూప్ టెంట్లు వేయాలని సూచించారు. అన్ని ప్రభు త్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, జిల్లా అధికారులు హాజరుకావాలన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ప్రొటోకాల్ ప్రకారం తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. అనంతరం మార్చ్‌ఫాస్ట్ రిహార్సల్స్‌ను పర్యవేక్షించారు. అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి, డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజ్, ఆర్‌అండ్‌బీ డీఈ బీమ్లానాయక్, డీఈఓ రవీందర్‌రెడ్డి, ఉద్యానశాఖ అధికారి మరియన్న, ము న్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, తహసీల్దార్ రాజేశ్వర్‌రావు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
వేడుకలకు ముస్తాబైన కలెక్టరేట్
మహబూబాబాద్: పంద్రాగస్టు వేడుకలకు కలెక్టరేట్‌ను అందంగా ముస్తాబు చేశారు. గురువారం కలెక్టరేట్‌ను విద్యుత్ దీపాలు, జాతీయ జెండాలతో అలంకరించారు. రాత్రివేళ విద్యుత్ వెలుగుల్లో కలెక్టరేట్ జిగేల్‌మంది. కాగా, కలెక్టరేట్ దారిలో వెళ్లే వారు విద్యుత్ వెలుగులను ఆసక్తిగా తిలకించారు.

పంద్రాగస్టు వేడుకలకు సిద్ధం