
ఉదయం 9.30 గంటలకే పతాకావిష్కరణ
సాక్షిప్రతినిధి, వరంగల్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పంద్రాగస్టు రోజున జిల్లాకేంద్రాల్లో ఉదయం 9.30 గంటలకే జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌లో జిల్లాల వారీగా వేడుకలకు హాజరయ్యే మంత్రులు/ప్రముఖుల జాబితాను బుధవారం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు విడుదల చేశారు. హనుమకొండ జిల్లా పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో అటవీశాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. వరంగల్‌లో రెవెన్యూశాఖ, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ములుగులో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. అదే విధంగా మహబూబాబాద్‌లో డిప్యూటీ స్పీకర్ జె.రామచంద్రునాయక్, జనగామలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, జయశంకర్ భూపాలపల్లిలో తెలంగాణ ఎస్‌టీ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్‌లు జాతీయ పతాకాలను ఆవిష్కరించనున్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం గార్డ్ ఆఫ్ ఆనర్‌లో గౌరవ వందనం స్వీకరిస్తారని, అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రటరీ ఆ ఉత్తర్వులో జిల్లా కలెక్టర్‌లకు సూచించారు.
పంద్రాగస్టు వేడుకలకు ప్రభుత్వం ఉత్తర్వులు
మహబూబాబాద్‌కు రామచంద్రునాయక్..