కల్వల వాసికి అరుదైన అవకాశం | - | Sakshi
Sakshi News home page

కల్వల వాసికి అరుదైన అవకాశం

Aug 14 2025 7:44 AM | Updated on Aug 14 2025 7:44 AM

కల్వల వాసికి అరుదైన అవకాశం

కల్వల వాసికి అరుదైన అవకాశం

● ఆసియా పసిఫిక్‌ గ్రామీణాభివృద్ధి కేంద్రంలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా వెంకటమల్లు నియామకం

కేసముద్రం: రాజేంద్రనగర్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ సంస్థ(ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)లో రీసెర్చ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మహబూబాబాద్‌ జిల్లా కేసముంద్రం మండలం కల్వ ల గ్రామానికి చెందిన తాడబోయిన వెంకటమల్లు అంతర్‌ ప్రభుత్వ సంస్థ సెంటర్‌ ఆన్‌ ఇంటిగ్రేటెడ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఫర్‌ ఏషియా అండ్‌ పసిఫిక్‌ (సీఐఆర్‌డీఏసీ)లో ప్రోగ్రాం ఆఫీసర్‌గా నియామకమయ్యారు. 15 దేశాల్లో గ్రామీణాభివృద్ధి పేదరిక నిర్మూలన కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ సంస్థలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా ఎంపిక కావడం పట్ల గ్రామస్తులు వెంకటమల్లును అభినందించారు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఉన్న ఆ సంస్థకు చెందిన ప్రధాన కార్యాలయంలో ప్రోగ్రాం ఆఫీసర్‌గా తనను నియమిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు వెంకటమల్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement