
పరికరాలు లేవు.. వైద్యం అందించలేము
ఎంజీఎం : పూర్తిస్థాయి వైద్యాధికారులు లేకపోవ డం, హెచ్‌ఓడీలు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుండ డం, వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు జంకుతుండడం వెరసి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పెద్ద సార్లు ఉంటారు అని భరోసాతో వస్తున్న రోగులకు ఆశించిన మేర వైద్యం అందడం లేదు. అలాంటి ఘటనే ఇది. జూనియర్ వైద్యుల పర్యవేక్షణలో వందలాది మంది రోగులకు చికిత్సలు అందిస్తున్న క్రమంలో పైల్స్‌తో బాధపడే ఓ రోగికి ఎంజీఎం ఆస్పత్రిలో వైద్యం అందించలేమని గెంటేసినంతా పనిచేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పరిపాలనాధికారులు క్యాజు వాలిటీ వద్దకు పరుగులు పెట్టి సదరు రోగిని అడ్మి ట్ చేసుకుని చికిత్స అందించడం మొదలు పెట్టా రు. వివరాలోకి వెళ్తే.. వరంగల్ జిల్లా రాయపర్తి మండం కొండూరు గ్రామానికి చెందిన బాచబో యిన రత్నాకర్ అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక భార్య బుచ్చమ్మతో కలిసి సోమవారం ఎంజీఎం ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చారు. పరీక్షలు చేసిన వైద్యులు పైల్స్ సమస్య ఉన్నట్లు గుర్తించారు. వైద్యం చేయడానికి అవసరమైన పరికరాలు అందుబాటులో లేవని చెప్పి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి కి వెళ్లాలని రెఫర్ చేశారు. దీంతో ఏమీ తోచని స్థితి లో సదరు రోగి మూడు రోజులుగా ఎంజీఎం ఆస్పత్రి ఎదురుగా ఉన్న రేకుల షెడ్‌లోనే వేచి ఉన్నాడు. ఈ విషయం బుధవారం సోషల్ మీడియాలో రావడంతో వెంటనే ఎంజీఎం పరిపాలనాధికారులు కా ర్యాలయాలు వదిలి క్యాజువాలిటీ వద్దకు పరుగులు పెట్టారు. బాధితుడిని స్వయంగా అత్యవసర విభాగంలో చేర్పించి చికిత్స మొదలు పెట్టారు. కాగా, చివరకు మెరుగైన చికిత్స నిమిత్తం మళ్లీ హైదరాబాద్‌కు తరలించారు.
ట్రాక్టర్ ప్రమాదంలో
విద్యార్థి మృతి
శాయంపేట : ట్రాక్టర్ ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన మంగళ వారం రాత్రి మండలంలోని నేరేడుపల్లి శివారులో చోటు చేసుకుంది. ఎస్సై పరమేశ్ కథనం ప్రకారం.. ఆత్మకూరు మండలం హౌజుబుజుర్గు గ్రా మానికి చెందిన షేక్ ఫరాజ్ అహ్మద్ (16) శాయంపేట మండలం నేరేడుపల్లిలోని జెడ్పీ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో రోజు మాదిరి మంగళవారం పాఠశాలకు వెళ్లాడు. సా యంత్రం 4 గంటలకు ఇంటికి వెళ్లే సమయంలో పా ఠశాల ఎదుట హౌజుబుజుర్గు గ్రామానికి చెందిన షేక్‌షబినాబీకి చెందిన ట్రాక్టర్‌ను డ్రైవర్ ఉమర్ నడుపుకుంటూ వస్తుండగా షేక్ ఫరాజ్ అహ్మద్‌తో పాటు కొంత విద్యార్థులు ఎక్కారు. ఈ క్రమంలో నేరేడుపల్లి శివారులోని మలుపు వద్ద డ్రైవర్ బ్రేక్ వేయగా ట్రాక్టర్‌లో కూర్చున్న ఫరాజ్ అహ్మద్ ఎగిరి రోడ్డుపై పడగా తీవ్ర గాయాలయ్యాయి. వారి వెను క వస్తున్న అదే గ్రామానికి చెందిన షేక్ కరీం.. ఫరా జ్ అహ్మద్ తల్లిదండ్రులకు సమాచారం అందించగా వారు హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే ఫరాజ్ అహ్మద్ మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి షేక్ కమ ల్ ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● ఎంజీఎంలో కొనసాగుతున్న
రెఫరల్ ట్రీట్‌మెంట్
● మూడు రోజులుగా వైద్యం కోసం క్యాజువాలిటీ ఎదుట పడిగాపులు
● సోషల్ మీడియా కథనాలతో రోగి వద్దకు వైద్యులు

పరికరాలు లేవు.. వైద్యం అందించలేము

పరికరాలు లేవు.. వైద్యం అందించలేము