
16న శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
హన్మకొండ: శ్రీ కృష్ణ జన్మాషమి వేడుకలను ఈ నెల 16(శనివారం)న ఘనంగా నిర్వహించనున్నట్లు యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు యాదవ్ తెలిపారు. ఈమేరకు బుధవారం హనుమకొండ రాంనగర్‌లోని బీసీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారత దేశంలోనే అత్యంత భారీగా ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. యాదవ కుల దైవం శ్రీ కృష్ణుడు, బలరాముడని తెలిపారు. ప్రస్తుతం సైన్స్, టెక్నాలజీ మీదనే విద్యార్థులు, యువకుల దృష్టి సారిస్తున్నారు. అందుకే భావితరాలకు సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్ర తెలియచెప్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ నేపథ్యంలో మూడేళ్లుగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటలకు రాంనగర్ నుంచి శ్రీ కృష్ణుడి శోభాయాత్ర ప్రారంఽభమై అంబేడ్కర్ కూడలి, పోలీస్ హెడ్‌క్వార్టర్, అశోక, బస్టాండ్ కూడళ్ల మీదుగా బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రం వరకు సాగుతుందన్నారు. అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజుతో పాటు పార్టీలకతీతంగా నాయకులు పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ జన్మాష్టమీ పోస్టర్లు, కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ప్రతినిధులు కన్నెబోయిన రాజయ్య యాదవ్, గిరబోయిన రాజయ్య యాదవ్, బొంగు అశోక్, కెంచ కుమారస్వామి, రాజేందర్, ఎల్లావుల కుమార్ యాదవ్, రజనీకుమార్, దూడయ్య, చెన్నమల్లు, బుట్టి శ్యాం యాదవ్, బొంగు రాజు యాదవ్ పాల్గొన్నారు.
యాదవ వెల్ఫేర్ ట్రస్ట్ ఉమ్మడి వరంగల్ జిల్లా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజు