
విద్యుత్ పోటీల్లో వరంగల్ సర్కిల్ అత్యుత్తమ ప్రదర్శన
హన్మకొండ: టీజీ ట్రాన్స్‌కో, టీజీ డిస్కంల ఇంటర్ సర్కిల్ పోటీల్లో ఉమ్మడి వరంగల్ సర్కిల్ క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. కప్‌లు గెలుచుకున్నారు. 2025–2026 సంవత్సరానికిగాను టీజీ ట్రాన్స్ కో, టీజీ డిస్కంల ఇంటర్ సర్కిల్ పోటీలు ఈ నెల 4 నుంచి 6వ తేదీ వరకు నిజామాబాద్‌లో జరిగాయి. ఇందులో హాకీలో ఉమ్మడి వరంగల్ సర్కిల్ జట్టు ప్రథమ స్థానం, కబడ్డీలో ద్వితీయ స్థానం సాధించి ట్రోఫీలు అందుకుంది. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో ఎస్‌ఈ పి.మధసూదన్ రావు, డీఈ టెక్నికల్, సేఫ్టీ ఆఫీసర్ విజేందర్ రెడ్డిని ఇరు జట్ల క్రీడాకారులు కలిసి ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా వారు క్రీడాకారులను అభినందించారు.
హాకీలో ప్రథమ స్థానం,
కబడ్డీలో ద్వితీయ స్థానం