
బకాయిలు వెంటనే చెల్లించాలి
నెహ్రూసెంటర్: పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిపో ఎదుట రిటైర్డ్ ఉద్యోగులు ఽమంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడుతూ... పదివేల మంది కార్మికులకు బెనిఫిట్స్ రాక ఇబ్బందులు పడుతున్నారని, పిల్లల పెళ్లిళ్లు, చదువులు, వైద్యానికి అప్పులు తెచ్చి ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఉద్యోగ విరమణ బెనిఫిట్స్‌తో పాటు అన్ని రకాల బకాయిలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎం శివప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పట్టాబి లక్ష్మ య్య, ఆర్.ముత్తయ్య, నాగేశ్వర్‌రావు, సాంబయ్య, స్వర్ణలత, వెంకటేశ్వర్లు, కోటయ్య, సత్యనారాయణ, రాధాకృష్ణ, కృష్ణమూర్తి, రాజమల్లు, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నా