
అలంకరణ లైట్లు సర్దుతుండగా..
తొర్రూరు: అలంకరణ లైట్లు సర్దుతుండగా ఓ యువకుడు విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజా మున మహబూ బాబా ద్ జిల్లా తొర్రూరులో చోటు చేసుకుంది. ఎస్సై ఉపేందర్ కథనం ప్రకారం.. తొర్రూరు మండలం పెద్దమంగ్యా తండాకు చెందిన జాటోత్ సుమన్(30) వారాంతపు సంతల్లో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో తొర్రూ రు పట్టణం 2వ వార్డులోని అరుణోదయ కాలనీలో కొత్త ఇల్లు నిర్మించుకుని సోమవారం గృహ ప్రవేశ కార్యక్రమం పూర్తి చేశాడు. మంగళవారం బంధువులకు విందు ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇంటి గోడపై అలంకరణ లైట్లు సర్దుతుండగా విద్యుత్ షాక్ తగిలి కుప్పకూలాడు. బంధువులు గుర్తించి విద్యుత్ నిలిపివేసి చూడగా అప్పటికే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. సుమన్‌కు గతంలో ఓ మహిళతో వివాహమై విడాకులు కాగా ప్రస్తుతం మరో మహిళతో సహ జీవనం సాగిస్తున్నాడు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు సంతోష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
● విద్యుదాఘాతంతో యువకుడి మృతి
● తొర్రూరులో ఘటన