
ఉద్యాన పంటల ఆవశ్యకతను గుర్తించాలి
మహబూబాబాద్ రూరల్ : ప్రతి ఒక్కరూ ఉద్యాన పంటల ఆవశ్యకతను గుర్తించాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం సెంట్రల్ తెలంగాణ జోన్ హెడ్ సుచిత్ర అన్నారు. ఈమేరకు మంగళవారం మహబూబాబాద్ మండలం మల్యాల జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానంలో ఐసీఏఆర్, ఐఐఎంఆర్ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక ఆర్థిక సౌజన్యంతో ఉద్యాన పంటల సాగుపై రైతులకు శిక్షణ నిర్వహించి మొక్కలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ఉద్యాన పంటల ఆవశ్యకత, ప్రస్తుతం మార్కెట్ డిమాండ్, భవిష్యత్ వ్యాపార అవకాశాలపై తెలిపారు. ఉద్యాన విశ్వవిద్యాలయ పరిశోధనలు, మామిడి తోటల ఏర్పాటు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎరువులు, నీటి యాజమాన్యంపై వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న, జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అధిపతి కత్తుల నాగరాజు, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ కవిత, శాస్త్రవేత్త క్రాంతికుమార్, జేవీఆర్ హెచ్‌ఆర్‌ఎస్ శాస్త్రవేత్త ప్రశాంత్, కేవీకే శాస్త్రవేత్త సుహాసిని పాల్గొన్నారు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించిన పలువురు రైతులను శాస్త్రవేత్తలు, అధికారులు సన్మానించారు.
తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం సెంట్రల్ జోన్ హెడ్ సుచిత్ర